కరోనా కట్టడికి కేంద్రం ముందస్తు చర్యలు

కరోనా కట్టడికి కేంద్రం ముందస్తు చర్యలు

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. నిన్నటి కంటే ఇవాళ కేసులు పెరిగాయి. నిన్న 11 వేల కేసులు నమోదు కాగా ఇవాళ 14 వేల 506 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,34,33,345కు చేరగా 4,28,08,666 మంది బాధితులు కోలుకున్నారు. ఇక గత 24గంటల్లో 30మంది మరణించగా..మొత్తం 52,50,77 మంది మహమ్మారికి బలయ్యారు. తాజాగా కరోనా నుంచి 11వేల 574మంది కోలుకోగా.. దేశంలో ప్రసుత్తం 99 వేల 602 యాక్టివ్ కేసులున్నాయి. డైలీ పాజిటివిటి రేటు 3.35 శాతానికి చేరింది. 

కరోనాను కంట్రోల్ చేసేందుకు కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇక దేశంలో కేసులు పెరుగుతుండడంతో వ్యాక్సినేషన్ స్పీడప్ చేశారు అధికారులు. తాజాగా మరో రెండు వ్యాక్సిన్లకు అత్యవసర  వినియోగానికి DCGI అనుమతిచ్చింది. ఇప్పటి వరకు 197 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది. కరోనా టెస్టుల్లో వేగం పెంచాలని..కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. కరోనా కేసులను ముందస్తుగా గుర్తించటంతో వైరస్ వ్యాప్తి అరికట్టవచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా పండగల సీజన్ ప్రారంభకానున్న క్రమంలో తక్కువ ప్రయాణాలు ఉండేలా చూడాలని కోరింది.