ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత మస్ట్​నేటి నుంచి సర్వే

ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత మస్ట్​నేటి నుంచి సర్వే
  • 90 రోజులపాటు స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్​సిటీ, వెలుగు :  గ్రేటర్​ సిటీ పరిధిలో భూగర్భ జలా లు పడిపోకుండా వాటర్​బోర్డు ముందస్తు చర్యలు తీసుకుంటోంది. వచ్చే వేసవిలోనూ నీటి ఎద్దడి రాకుండా ఇప్పటి నుంచే యాక్షన్​ప్లాన్​ అమలు చేస్తోంది. ప్రతి ఇంటిలో తప్పకుండా ఇంకుడు గుంత తవ్వించుకునేలా అవగాహన కార్యక్రమాలు ప్లాన్​ చేసింది. ఇందులో భాగంగా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం నుంచి 90 రోజుల పాటు స్పెషల్​డ్రైవ్​చేపడుతోంది. అధికారులు ఇంటింటికీ తిరుగుతూ ఇంకుడు గుంత ఉపయోగాలను వివరించనున్నారు. 

మరోవైపు ఇంకుడు గుంతలు లేని ఇండ్ల లెక్క తీయనున్నారు. వాటర్​బోర్డు పరిధిలోని 23 ఆపరేషన్ అండ్​ మెయింటెనెన్స్​డివిజన్ల పరిధిలో స్పెషల్​డ్రైవ్ కొనసాగుతుంది. అధికారులు ఇంటింటికి వెళ్లి పాంప్లట్స్ ఇచ్చి ఇంకుడు గుంతల అవసరాన్ని వివరిస్తారు. 300 గజాల స్థలంలో నిర్మించిన ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఉండాలనే నిబంధనను తప్పక అమలు చేస్తామని చెబుతున్నారు. తర్వాత దశల వారీగా 200 గజాల విస్తీర్ణంలోని ఇంటిలోనూ తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మించుకునేలా ప్లాన్​ చేస్తున్నారు. 

గతేడాది వేసవిలో రోజుకు 12 వేల ట్యాంకర్లను సప్లయ్ ​చేశారు. ఏయే ప్రాంతాల నుంచి అధిక మొత్తంలో ఆర్డర్లు వచ్చాయన్నది అధికారుల దగ్గర లెక్కలు ఉన్నాయి. ఆయా ప్రాంతాలతోపాటు సిటీ మొత్తం రాబోయే రోజుల్లో వాటర్​ట్యాంకర్ల డిమాండ్​తగ్గించేందుకు, భూగర్భ జలాలు పెంచేందుకు స్పెషల్​డ్రైవ్​ఉపయోగపడుతుందని వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి తెలిపారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.