కంది ఐఐటీహెచ్​లో ఇన్నోవేషన్ 2.0.. 120 ప్రాజెక్టుల ప్రదర్శన

కంది ఐఐటీహెచ్​లో ఇన్నోవేషన్ 2.0.. 120 ప్రాజెక్టుల ప్రదర్శన

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా కందిలోని ఇం డియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్ క్యాంపస్ లో శుక్రవారం ఇన్వెంటివ్ ఇన్నోవేషన్ ఫెయిర్ 2.0 ప్రారంభమైంది. శుక్రవారం దీన్ని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించగా, కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ మూర్తి పాల్గొన్నారు. దేశంలోని పలు యూనివర్సిటీలకు చెందిన స్టూడెంట్స్ ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ స్టాల్స్​ను మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ పరిశీలించారు.

దేశంలోని వివిధ విద్యాసంస్థలు, పరిశ్రమల అనుసంధానం కోసం ఈ ప్రోగ్రామ్​ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి ​మాట్లాడుతూ ఇండియా అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​పై ఫోకస్ పెట్టడం వల్ల నూతన ఆవిష్కరణలు ఆవిష్కృతమవుతున్నాయన్నారు. ఐఐటీ హైదరాబాద్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ బివి.మోహన్ రెడ్డి, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్.మూర్తి, ఇన్వెస్ట్ ఇండియా సీఈవో నీరువతిరాయి, ఐఐటీ హైదరాబాద్ డీన్ సూర్య కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వరంగల్ నిట్​లో  టెక్నోజియాన్ షురూ

హనుమకొండ/కాజీపేట: వరంగల్​నిట్​లో శుక్రవారం టెక్నికల్ ​ఫెస్ట్​ ప్రారంభమైంది. నిట్​ స్టూడెంట్ వెల్ఫేర్​ డీన్​ ప్రొఫెసర్​ డి.శ్రీనివాసాచార్య, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ప్రెసిడెంట్ ఫ్రొఫెసర్ హరికృష్ణ, ఫ్యాకల్టీ అడ్వైజర్ ఫ్రొఫెసర్ హరిప్రసాద్ రెడ్డి అంబేద్కర్​ లర్నింగ్​ సెంటర్​లో  కార్యక్రమాన్ని ప్రారంభించారు​. మూడురోజుల పాటు కొనసాగే ఈ ఫెస్ట్​లో వివిధ అంశాలపై వర్క్ షాప్స్​, క్విజ్ లు, 40 వరకు టెక్నికల్​ఈవెంట్స్​ నిర్వహించనున్నారు.

మొదటి రోజు ట్రేడింగ్ ​పిట్, ఆర్బిక్స్​, క్రాక్​ ది క్వెరీ, ఇన్నోచెమ్, క్రియేటివ్​ రోబోటిక్స్​ తదితర ఈవెంట్లు నిర్వహించారు.  వివిధ స్కూల్స్ కు చెందిన ​స్టూడెంట్స్​ కూడా ఎగ్జిబిట్స్​ ప్రదర్శించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇంజినీరింగ్​ విద్యార్థులు తరలిరాగా.. శనివారం ముఖ్యమైన ఈవెంట్లు జరగనున్నాయని నిట్​ఆఫీసర్లు తెలిపారు. ఏరోస్పేస్ ​సైంటిస్ట్  ప్రొఫెసర్ ​శ్రీనివాసన్​సుందర్ రాజన్, కలెక్టర్​ సిక్తా పట్నాయక్​, వరంగల్ నిట్​ డైరెక్టర్​ బిద్యాధర్​ సుభూది హాజరుకాలేదు.