
వడ్లు అమ్మి 2 నెలలు దాటినా తమ బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమ కాలేదని సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండలం అన్నారం రైతులు బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు. అర్ధనగ్నంగా మెడలో వేపకొమ్మల దండలు వేసుకుని రైతులు తన్నీరు వెంకన్న, పూసపల్లి శ్రీనివాస్, సాగర్‌రెడ్డి, వెంకట రామనర్సయ్య దీక్షకు కూర్చున్నారు. టైమ్‌కు డబ్బులు అందక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ఎలాంటి కటింగులు లేకుండా డబ్బు వేయాలని కోరారు. – తుంగతుర్తి, వెలుగు