సైగల భాషను వినిపించే స్మార్ట్‌  గ్లవ్స్

సైగల భాషను వినిపించే స్మార్ట్‌  గ్లవ్స్

వినికిడి శక్తి లేని వారు సైగల ద్వారా మాట్లాడుకోవడం చూస్తుంటాం. అయితే ఆ సైగల భాష అందరికీ రాదు.  ఒక్కోసారి వాళ్లు చేసే సైగలు ఎదుటివాళ్లకు అర్థం కావు. అందుకే సైగల భాష చాలా విలక్షణమైందని చెప్తుంటారు. అయితే ఆ సైగలకు అర్థం చెప్పేలా హైటెక్‌‌‌‌ గ్లౌవ్జ్‌‌‌‌ని రూపొందించాడు కెన్యాకు చెందిన రాయ్‌‌‌‌ అల్లెలా.

సైగల్ని ఆడియో రూపంలోకి మారుస్తుంది స్మార్ట్ గ్లౌవ్జ్‌‌‌‌. ఈ  గ్లౌవ్జ్‌‌‌‌కి ఉన్న రోబో వేళ్లు సెన్సార్ల ఆధారంగా పని చేస్తాయి. అందులో లాంగ్వేజ్‌‌‌‌ సెటప్‌‌‌‌ ఉంటుంది. సైగలు చేసినప్పుడు వేళ్ల కదలికలను అర్థం చేసుకుని ఆ సెన్సర్లు  బ్లూటూత్‌‌‌‌ ద్వారా సమాచారాన్ని (సైగల ద్వారా చెప్పదల్చుకుంటున్న విషయాన్ని) స్మార్ట్‌‌‌‌ ఫోన్‌‌‌‌కి చేరవేస్తాయి. అప్పుడు ఆ పదాలు వాయిస్‌‌‌‌ రూపంలో వినిపిస్తాయి.  సైగల భాష నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్ల కోసం ఈ గ్లౌవ్జ్‌‌‌‌లో ఒక స్పెషల్ ఫీచర్‌‌‌‌ ఉంది.
ఈ స్మార్ట్‌‌‌‌ గ్లౌవ్జ్‌‌‌‌కి ‘సైన్‌‌‌‌–ఐవో’ అని పేరు పెట్టాడు అల్లెలా. ఈ ఏడాది ‘ఆఫ్రికా ప్రైజ్‌‌‌‌ ఫర్‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌’ మెడల్‌‌‌‌ కోసం పోటీపడిన ఆరు ఆవిష్కరణలలో ‘సైన్‌‌‌‌–ఐవో’ ఒకటి.

మేనకోడలి కోసం మొదలై…

రాయ్‌‌‌‌ అల్లెలా ఇంటెల్‌‌‌‌ కంపెనీలో ప్రోగ్రాం మేనేజర్‌‌‌‌. బధిరురాలైన తన మేనకోడలితో కమ్యూనికేట్‌ ‌‌‌ అయ్యేందుకు రాయ్ ప్రయత్నించేవాడు. ఆ చిన్నారి పెదాల కదలికలతో మాట్లాడేందుకు ప్రయత్నించేది. కానీ, వినికిడి సమస్య వల్ల ఎదుటివాళ్లు చెప్పేది అర్థం చేసుకోలేకపోయేది.  దీంతో మేనకోడలి సమస్యని తీర్చేందుకు రాయ్‌‌‌‌ స్వయంగా రంగంలోకి దిగాడు. సైన్‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌ (సైగల భాష)ని ఆడియో రూపంలోకి మార్చే గ్లౌవ్జ్‌‌‌‌ను కనిపెట్టాడు. ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా మిగోరి కౌంటీలోని దివ్యాంగుల పాఠశాలలో పరీక్షించాడు. తొంభై మూడు శాతం ప్రయోగం సక్సెస్‌‌‌‌ కావడంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆ దెబ్బకు ప్రపంచం మొత్తం అతని పేరు మారుమ్రోగింది. 2017లో  ‘యూఎస్‌‌‌‌ సొసైటీ ఆఫ్‌‌‌‌ మెకానికల్ ఇంజినీర్స్‌‌‌‌’ పోటీల్లో ఇన్నోవేషన్‌‌‌‌ షోకేజ్‌‌‌‌(లోకల్‌‌‌‌ కంట్రీస్‌‌‌‌) విభాగంలో ‘హార్డ్‌‌‌‌వేర్‌‌‌‌ ట్రెయిల్‌‌‌‌బ్లేజర్‌‌‌‌’ అవార్డు గెలుచుకున్నాడు అల్లెలా.  కెన్యా నేషనల్‌‌‌‌ ఇన్నోవేషన్‌‌‌‌ ఏజెన్సీ ‘సైన్‌‌‌‌–ఐవో’కి ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. ‘‘ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. 40 కోట్ల మంది బధిరులు ఉన్నారు. చాలా మందికి సైగల భాష రాక ఇబ్బంది పడుతున్నారు. అలాంటివాళ్లకు ఈ స్మార్ట్‌‌‌‌ గ్లౌవ్జ్‌‌‌‌ని అంకితం ఇస్తున్నా. కెన్యాలోని ‘స్పెషల్–నీడ్స్‌‌‌‌’ స్కూల్స్‌‌‌‌లో సైన్‌‌‌‌–ఐవో ఉపయోగపడాలన్నదే నా కోరిక’ అని చెబుతున్నాడు రాయ్‌‌‌‌ అల్లెలా.

విమర్శలు

రాయ్‌‌‌‌ అల్లెలా సైన్‌‌‌‌–ఐవో కనిపెట్టడానికి ముందు యూనివర్సిటీ ఆఫ్​ ఆంట్‌‌‌‌వెర్ప్‌‌‌‌ పరిశోధకులు రోబో హ్యాండ్‌‌‌‌ కనిపెట్టారు. త్రీడీ ప్రింట్‌‌‌‌ ఆధారంగా రూపొందించిన ఈ ప్రాజెక్టు పేరు ‘ఆస్లాన్‌‌‌‌’. ఇది కంప్యూటర్‌‌‌‌ స్క్రీన్‌‌‌‌ మీద కనిపించే సమాచారాన్ని, స్క్రిప్ట్‌‌‌‌ను ‘ఫింగర్‌‌‌‌ స్పెల్‌‌‌‌’ చేస్తుంది. తద్వారా చెప్పే విషయం బధిరులకు ఈజీగా అర్థమవుతుంది. దీనికి పూర్తి రివర్స్‌‌‌‌ పద్ధతిలో  రాయ్‌‌‌‌ అల్లెలా స్మార్ట్‌‌‌‌ గ్లౌవ్జ్‌‌‌‌ తయారు చేశాడు. అంటే అల్రెడీ కనుగొన్న వస్తువును అతడు మార్పులు మాత్రమే చేశాడు. కానీ, అల్లెలా కొత్తగా కనిపెట్టినట్లు చెప్పడంతో విమర్శలు వెల్లువెత్తాయి.