
న్యూఢిల్లీ: ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ ఐపీఓ ద్వారా రూ. ఆరు వేల కోట్లు సేకరించడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి డ్రాఫ్ట్ పేపర్లను అందజేసింది. కాన్ఫిడెన్షియల్ఫైలింగ్ విధానంలో దరఖాస్తు సమర్పించింది. పది శాతం కంటే ఎక్కువ ప్రతిపాదిత ఈక్విటీ డైల్యూషన్‌తో కంపెనీ దాదాపు రూ. 50వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పబ్లిక్ ఆఫర్‌లో ఎక్కువ భాగం కొత్త ఇష్యూ ఉంటుంది. ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం, నిర్వహించడం చేస్తుంది.