
- నలుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు
- ఇప్పటికే పీఎస్‌లో కేసు నమోదు
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా వైద్యాధికారిని లైంగికంగా వేధించారంటూ సూర్యాపేట జిల్లా ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్, నాన్కమ్యూనికబుల్డిసీజెస్అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తిపై కేసు నమోదు కాగా ఆయనపై ఎంక్వైరీ చేసేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అడిషనల్ కలెక్టర్ ప్రియాంక కమిటీ చైర్మన్‌గా, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆఫీసర్, జిల్లా ఎస్సీ వెల్ఫేర్ డెవలప్మెంట్ఆఫీసర్, డీఎంహెచ్‌ఓ ఆఫీస్ ప్రోగ్రాం ఆఫీసర్లు కమిటీ మెంబర్లుగా ఉంటారు. ఇందులో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ లో మహిళా వైద్యాధికారితో పాటు ఇద్దరు ప్రోగ్రాం ఆఫీసర్లు, ఇద్దరు మహిళా సిబ్బందిని విచారించారు.
పరారీలో డాక్టర్ కళ్యాణ చక్రవర్తి..
డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి ప్రస్తుతం పరారీలో ఉన్నారని, ఆయన కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ నెల 28న ఆయనపై సూర్యాపేట పీఎస్‌లో కేసు నమోదు కాగా అప్పటి నుంచే 10 రోజులపై సెలవుపై వెళ్లాడని డీఎంహెచ్‌వో డాక్టర్ కోట చలం తెలిపారు. ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్వస్తోందన్నారు. అయితే కల్యాణ్ చక్రవర్తి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
తప్పించేందుకు అధికారుల ప్రయత్నాలు..
డాక్టర్ చక్రవర్తిని తప్పించేందుకు సొంత శాఖ ఆఫీసర్లే ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఆలన విభాగానికి చక్రవర్తి ప్రోగ్రామ్ఆఫీసర్గా ఉండగా, ఇదే విభాగంలో పనిచేసే మహిళ వైద్యాధికారిని లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు వచ్చాయి. అంతకుముందే ఇబ్బంది పెట్టగా మే 20న డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశారు. చర్యలు లేకపోవడంతోనే మే 28న సూర్యాపేట టౌన్ పీస్‌లో కంప్లయింట్ చేశారు. ఇంటర్నల్ కమిటీ పేరుతో విచారణ చేపట్టకపోకపోవడంతోనే బాధితురాలు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లినట్టు తెలుస్తోంది.