ఎఫ్‌ క్లబ్‌లో  ఏం జరిగింది?

ఎఫ్‌ క్లబ్‌లో  ఏం జరిగింది?

డ్రగ్స్​ కేసులో ఆరా తీస్తున్న ఈడీ
విచారణకు హాజరైన నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

డ్రగ్స్‌‌ కేసులో సినీ నటి రకుల్‌‌ ప్రీత్‌‌ సింగ్​ శుక్రవారం ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ) ముందు హాజరయ్యారు. ఆమెకు సంబంధించిన మూడు బ్యాంక్‌‌  అకౌంట్లలో 2016 నుంచి 2017 జూన్‌‌  వరకు జరిగిన  ట్రాన్సాక్షన్స్​ను ఈడీ పరిశీలించింది.  సినీ నటుడు నవదీప్‌‌కు చెందిన  ఎఫ్‌‌  క్లబ్​లోని పార్టీలు కేంద్రంగా ఈడీ దర్యాప్తు సాగిస్తోంది.

హైదరాబాద్‌‌,వెలుగు: డ్రగ్స్‌‌ కేసులో సినీ నటి రకుల్‌‌ ప్రీత్‌‌ సింగ్​ శుక్రవారం ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ) ముందు హాజరయ్యారు. ఆమెకు సంబంధించిన మూడు బ్యాంక్‌‌  అకౌంట్లలో 2016 నుంచి 2017 జూన్‌‌  వరకు జరిగిన  ట్రాన్సాక్షన్స్​ను ఈడీ పరిశీలించింది. వాటి ఆధారంగా రకుల్​ను ప్రశ్నించి స్టేట్‌‌మెంట్‌‌ రికార్డ్  చేసింది. సినీ నటుడు నవదీప్‌‌కు చెందిన  ఎఫ్‌‌  క్లబ్​లోని పార్టీలు కేంద్రంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది.  క్లబ్ మేనేజర్ స్టేట్‌‌మెంట్ ఆధారంగా గత నెల రకుల్​కు సమన్లు జారీ చేసింది. షెడ్యూల్‌‌ ప్రకారం సోమవారం విచారణకు రావాల్సిన ఆమె.. శుక్రవారమే అటెండయ్యారు. ఎఫ్‌‌ క్లబ్‌‌లో కెల్విన్‌‌  పరిచయం దగ్గర్నుంచి 2016 నవంబర్‌‌‌‌లో జరిగిన పార్టీ వివరాలను ఈడీ రాబట్టింది. పార్టీలో రకుల్‌‌  కూడా పాల్గొన్నట్లు గుర్తించింది. ఆ రోజు కెల్విన్‌‌, నవదీప్, ఎఫ్‌‌ క్లబ్‌‌ మేనేజర్​తో పాటు రకుల్‌‌ బ్యాంక్ అకౌంట్ల నుంచి అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్‌‌ జరిగినట్లు ఈడీ భావిస్తోంది. కెల్విన్‌‌ అకౌంట్స్‌‌లో ఫ్రీజ్ చేసిన రూ. 30 లక్షల ట్రాన్సాక్షన్లలో రకుల్​ అకౌంట్‌‌ వివరాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించింది.
ఆఫీసు ఓపెన్​ చేయకముందే వచ్చి..!
శుక్రవారం ఉదయం 9.10 గంటలకే హైదరాబాద్​ బషీర్‌‌‌‌బాగ్‌‌లోని ఈడీ ఆఫీస్‌‌కు రకుల్​ ప్రీత్​సింగ్​ వచ్చారు. ఆఫీస్‌‌ ఓపెన్ చేయకపోవడంతో థర్డ్‌‌ఫ్లోర్‌‌‌‌లోని హాల్‌‌లో వెయిట్‌‌ చేశారు. రకుల్​తో పాటు చార్టెడ్ అకౌంటెంట్‌‌, పర్సనల్ సెక్రటరీ కూడా వచ్చారు. ఉదయం10.30 గంటల తర్వాత తన చార్టెడ్‌‌ అకౌంటెంట్‌‌తో కలిసి ఈడీ అసిస్టెంట్‌‌డైరెక్టర్ ముందు హాజరయ్యారు. ముగ్గురు ఉమెన్​ ఆఫీసర్లు, ఇద్దరు మెన్ ఆఫీసర్లతో కూడిన స్పెషల్‌‌ టీం  రకుల్​ను విచారించింది. లంచ్‌‌ టైంలో ఈడీ అందించిన ఫుడ్‌‌ కాకుండా ఇంటి నుంచి తెచ్చిన భోజనాన్ని ఆమె తిన్నారు. ఆ తర్వాత  సాయంత్రం 4 గంటల వరకు రకుల్‌‌ ప్రీత్‌‌ సింగ్‌‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. తదుపరి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. షెడ్యూల్‌‌లో భాగంగా బుధవారం సినీ నటులు దగ్గుబాటి రానా, గురువారం రవితేజ, డ్రైవర్ శ్రీనివాస్‌‌ను విచారించనున్నారు.