ఫుడ్‌‌‌‌‌‌‌‌ పాయిజన్‌‌‌‌‌‌‌‌పై ఎంక్వైరీ

ఫుడ్‌‌‌‌‌‌‌‌ పాయిజన్‌‌‌‌‌‌‌‌పై ఎంక్వైరీ
  •     గురుకులంలో విచారణ చేసిన ఆర్డీవో, ఫుడ్‌‌‌‌‌‌‌‌ ఇన్స్‌‌‌‌‌‌‌‌పెక్టర్‌‌‌‌‌‌‌‌
  •     ఫుడ్‌‌‌‌‌‌‌‌ శాంపిల్స్‌‌‌‌‌‌‌‌ను ల్యాబ్‌‌‌‌‌‌‌‌కు పంపిన ఆఫీసర్లు
  •     స్టూడెంట్లు కోలుకోకముందే ఎందుకు తీసుకొచ్చారని పేరెంట్స్‌‌‌‌‌‌‌‌ ఆగ్రహం

జనగామ, వెలుగు : జనగామ శివారు పెంబర్తి సమీపంలోని నర్మెట బాలికల గురుకులంలో స్టూడెంట్లు అస్వస్థతకు గురైన ఘటనపై ఆఫీసర్లు ఎంక్వైరీ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌ షేక్‌‌‌‌‌‌‌‌ రిజ్వాన్‌‌‌‌‌‌‌‌ బాషా ఆదేశాలతో ఆర్డీవో కొంరయ్యతో పాటు ఫుడ్‌‌‌‌‌‌‌‌ ఇన్స్‌‌‌‌‌‌‌‌పెక్టర్‌‌‌‌‌‌‌‌ కృష్ణమూర్తి శక్రవారం ఉదయం గురుకులానికి వచ్చారు. స్టూడెంట్లతో మాట్లాడి వివరాలు సేకరించారు. స్టూడెంట్ల అస్వస్థతకు ఫుడ్‌‌‌‌‌‌‌‌ పాయిజనేనా.. మరేదైనా ఆరోగ్య సమస్య ఉందా అనే కోణంలో ఎంక్వైరీ చేశారు. ఫుడ్‌‌‌‌‌‌‌‌ శాంపిల్స్‌‌‌‌‌‌‌‌ను సేకరించి ల్యాబ్‌‌‌‌‌‌‌‌కు పంపించారు.

 అనంతరం ఆర్డీవో కొంరయ్య మాట్లాడుతూ గురుకులంలో ప్రాథమిక విచారణ చేసి రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ను కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు ఇచ్చామన్నారు. గురుకులం పరిసరాలు క్లీన్‌‌‌‌‌‌‌‌గా లేవన్నారు. స్టూడెంట్లు పూర్తిగా కోలుకోకముందే హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ నుంచి తీసుకువచ్చి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేశాక తగిన చర్యలు తీసుకుంటామన్నారు. 

పూర్తిగా కోలుకోకముందే డిశ్చార్జ్‌‌‌‌‌‌‌‌

గురుకులంలో మొత్తం 650 మంది స్టూడెంట్లు ఉండగా పావని, అక్షిత, కార్తీక, జ్యోత్స్న, ప్రతిభ అనే ఐదుగురు స్టూడెంట్లు గురువారం రాత్రి వాంతులు, కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో నైట్‌‌‌‌‌‌‌‌ డ్యూటీ చేస్తున్న సరిత అనే టీచర్​వారిని జనగామ శివారు చంపక్‌‌‌‌‌‌‌‌హిల్స్‌‌‌‌‌‌‌‌లోని ఎంసీహెచ్‌కు తీసుకెళ్లింది. స్టూడెంట్లు వంకాయ, సాంబారు, పెరుగుతో అన్న తినడం వల్ల ఫుడ్‌‌‌‌‌‌‌‌ పాయిజన్‌‌‌‌‌‌‌‌ అయి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన డాక్టర్లు ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. అయితే వారు పూర్తిగా కోలుకోకముందే అదే రాత్రి డిశ్చార్జ్‌‌‌‌‌‌‌‌ చేసి తిరిగి గురుకులానికి తీసుకొచ్చారు. 

బాధిత స్టూడెంట్ల పేరెంట్లు గురుకులానికి చేరుకొని ఇదే విషయంపై టీచర్లను నిలదీశారు. ఆరోగ్యం కుదుటపడకముందే ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. దీంతో స్టూడెంట్లను తిరిగి ఎంసీహెచ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. స్టూడెంట్లను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి పరామర్శించారు. భువనగిరి మాజీ ఎంపీ​బూర నర్సయ్యగౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి గురుకులానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.