సింగరేణి అక్రమాలపై ఎంక్వైరీ చేయాలె : కూనంనేని సాంబశివరావు

సింగరేణి అక్రమాలపై ఎంక్వైరీ చేయాలె : కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్, వెలుగు: విద్యుత్ సంస్థలతో పాటు సింగరేణి సంస్థలో జరిగిన కుంభకోణాలపైనా జ్యూడిషియల్ ఎంక్వైరీ చేయించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేండ్లు  ఒకే వ్యక్తి సీఎండీలో  కొనసాగారని తెలిపారు. 

ఈ క్రమంలో వేల కోట్లు మిస్ యూజ్ చేశారని, వెంటనే దీనిపై విచారణ చేయించాలని కోరారు. గురువారం ఆయన విద్యుత్ రంగంపై అసెంబ్లీలో  పెట్టిన శ్వేతపత్రాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణికి  ట్రాన్స్ కో నుంచి 17వేల కోట్లు,  జెన్​ కో నుంచి రూ.12వేల కోట్లు  రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం సింగరేణి కార్మికులందరికీ ఇంటి జాగ కేటాయించాలని కోరారు. 

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ శాలరీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం పరిధిలోని ఒక ఎకరానికి కరెంట్ ఖర్చు రూ.50వేలు అవుతుందని, మల్లన్నసాగర్​ కు 70వేలు అవుతుందని చెప్పారు. భవిష్యత్​లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.