లిక్విడ్ ఆక్సిజన్‌తో విశాఖకు చేరుకున్న ఐఎన్ఎస్ ఐరావత్

లిక్విడ్ ఆక్సిజన్‌తో విశాఖకు చేరుకున్న ఐఎన్ఎస్ ఐరావత్

కరోనా సెకండ్ వేవ్‌తో ఉక్కిరిబిక్కిరవుతున్న భారత్‌కు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా సింగపూర్ నుంచి పెద్దమొత్తంలో కరోనా సాయం అందుతోంది. సముద్ర సేతు IIలో భాగంగా సింగపూర్, వియాత్నం నుంచి పెద్దసంఖ్యలో ఆక్సిజన్ ట్యాంకర్లు శుక్రవారం భారత్‌కు చేరుకున్నాయి. INS  ఐరావత్ షిప్‌లో 158 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చేరింది. దీనితో పాటు 2,722  ఆక్సిజన్ సిలిండర్లు, 10 వెంటిలేటర్లను భారత్‌కు పంపాయి. అంతేకాకుండా.. కరోనా ట్రీట్మెంట్‌లో వాడే ఇతర మెడికల్ ఎక్విప్‌మెంట్‌ను కూడా పంపాయి.  నెల కిందట కూడా సింగ‌పూర్ పెద్దసంఖ్యలో ఆక్సిజన్ నిల్వల్ని భారత్‌కు పంపింది.