దేశీయంగా నిర్మించిన తొలి విమానవాహక యుద్ధ నౌక ఐఎన్​ఎస్​ విక్రాంత్​.

దేశీయంగా నిర్మించిన తొలి విమానవాహక యుద్ధ నౌక ఐఎన్​ఎస్​ విక్రాంత్​.

దేశీయంగా నిర్మించిన తొలి విమానవాహక యుద్ధ నౌక ఐఎన్​ఎస్​ విక్రాంత్​. భారత నౌకాదళ చరిత్రలో ఇప్పటివరకు నిర్మించిన యుద్ధ నౌకల్లో ఇదే అతి పెద్దది. ఇందులో 18 అంతస్తులు, 2300 కంపార్ట్​మెంట్స్​ ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబర్​ 2న కేరళలోని కొచ్చిన్​ షిప్​యార్డు లిమిటెడ్​లో జల ప్రవేశం చేసింది. దీంతో విమాన వాహక నౌకలను సొంతంగా నిర్మించుకోగల సామర్థ్యం ఉన్న ఆరో దేశంగా భారత్​ నిలిచింది. అమెరికా, బ్రిటన్​, రష్యా, ఫ్రాన్స్​, చైనా దగ్గర మాత్రమే ఈ సామర్థ్యం ఉంది. ఐఎన్​ఎస్​ విక్రాంత్​ నిర్మాణానికి రూ.20,000కోట్లను భారత ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ యుద్ధ నౌక తయారీకి 76 శాతం భారతీయ సాంకేతికతనే వినియోగించారు. ఎంఎఫ్​ స్టార్​ (నావర్​ రాడార్​ సిస్టమ్​), టకాన్​ (టాక్టికల్​ ఎయిర్​ నేవిగేషన్​ సిస్టమ్), రేజిస్టర్​–ఇ–ఏవియేషన్​ కాంప్లెక్స్​, శక్తి ఈడబ్ల్యూ స్వీట్​, డ్రైవర్​ డిటెక్షన్​ సిస్టమ్​ తదితర అత్యాధునిక వ్యవస్థలు విక్రాంత్​లో ఉన్నాయి. 

విక్రాంత్​ డిజైన్​ను భారత నౌకాదళంలోని వార్​షిప్​ డిజైన్​ బ్యూరో తయారు చేసింది. ఈ నౌక నిర్మాణాన్ని కొచ్చిన్​ షిప్​యార్డ్​ పూర్తి చేసింది. ఈ యుద్ధ నౌక నిర్మాణానికి 13 ఏండ్లు సమయం పట్టింది. ఇది గంటకు 28 నాట్స్​ వేగంతో ఏకధాటిగా 7,500 నాటికల్​ మైళ్లు ప్రయాణించగలదు. ఈ నౌకపై 30 యుద్ధ విమానాలు సౌకర్యవంతంగా నిలిపి ఉంచవచ్చు. మిగ్​–29కే ఫైటర్​ జెట్లు, కమోవ్​–31, హెచ్​ఆర్​–60ఆర్​ హెలికాప్టర్లు దీనిపై అందుబాటులో ఉంటాయి.  1971లో జరిగిన భారత్​– పాకిస్తాన్​ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన భారత తొలి విమాన వాహక నౌక ఐఎన్​ఎస్​ విక్రాంత్​ పేరును ఈ యుద్ధ నౌకకు పెట్టారు.