మేడారం జాతర పనుల పరిశీలన

మేడారం జాతర పనుల పరిశీలన

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా జరుగుతున్న పనులను బుధవారం కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీవో అంకిత్, అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పి.శ్రీజ, ఈవో రాజేంద్ర పరిశీలించారు. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డార్మెటరీ వెనుక పూజారుల గెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణం కోసం స్థలాన్ని చూశారు. అనంతరం ఐటీడీఏ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అధికారులతో రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతరకు వచ్చే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. పార్కింగ్, తాగునీరు, శానిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్యూలైన్లు, తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సూచించారు. ఆమె వెంట పంచాయతీరాజ్ ఈఈ అజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీపీవో వెంకయ్య, ఎలక్ట్రిసిటీ డీఈ నాగేశ్వరరావు, ఏపీవో వసంతరావు పాల్గొన్నారు.  

అంతకుముందు సమ్మక్క, సారలమ్మను ఐటీడీఏ పీవో అంకిత్, అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పి.శ్రీజ దర్శించుకున్నారు. అనంతరం వీవీఐపీ పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద కల్వర్టు నిర్మాణ పనులు, వెంగళాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చింతల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థలం, కొత్తూరు, ఊరటం వైపు జంపన్న వాగులో ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పూడికతీత పనులను పరిశీలించారు.