టంగటూరు –మోకిల బ్రిడ్జి పనుల పరిశీలన

టంగటూరు –మోకిల బ్రిడ్జి పనుల పరిశీలన

శంకర్​పల్లి, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలంలోని టంగటూరు– మోకిల మధ్య కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను చేవెళ్ల ఎంపీ రంజిత్​రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సకాలంలో పనులు పూర్తిచేయాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు రిపోర్టులు అందించాలని అధికారులకు సూచించారు. ఎంపీ వెంట మార్కెట్​కమిటీ చైర్మన్​ పాపారావు, నాయకులు గోపాల్​రెడ్డి, శ్రీనాథ్​ ఉన్నారు.