‘దృశ్యం’ సినిమా ఇన్ స్పిరేషన్ తో చేసిన మర్డర్

‘దృశ్యం’ సినిమా ఇన్ స్పిరేషన్ తో చేసిన మర్డర్

‘సినిమాల ప్రభావం జనాల మీద ఎంతుందో తెలియదు గానీ.. పంచ్ డైలాగ్ ల ప్రభావం మాత్రం గట్టిగా ఉంది’ అంటాడు ఓ సినిమాలో హీరో. కానీ సినిమాల ప్రభావంతో ఓ జంట చేసిన పని తెలిస్తే…  డైలాగ్ లే కాదు సీన్ లని కూడా  సీన్ రీ కనస్ట్రక్షన్ చేయొచ్చని  తెలిసి షాకవుతాడు. తమిళ సినిమా ‘96’, మళయాళ సినిమా ‘దృశ్యం’ చిత్రాల ఇన్ స్పిరేషన్ తో ఆ జంట ఘోరాలు, నేరాలు చేసే చివరికి కటకటాల పాలయ్యారు.

కొచ్చిలోని ఒక ప్రముఖ హోటల్ లో మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న కె. ప్రేమ్‌కుమార్ తన పదవ తరగతి స్నేహితులు ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్ధుల సమ్మెళనం కి హాజరవుతాడు. తమిళ సినిమా 96 లో చూపించినట్టుగా ఆ ఫంక్షన్ కి తనతో పాటు చదివిన పాత ప్రియురాలు సునీత కూడా రావడంతో వారి ప్రేమ మళ్లీ చిగురిస్తుంది.  అప్పటికే  ఇద్దరికి పెళ్లిళ్లు, పిల్లలు ఉన్నారని తెలిసీ కూడా..  ఆ తొలిప్రేమ ను మరచి పోలేక కలిసి బతుకుదామని నిర్ణయించుకుంటారు.

అప్పటి వరకూ హైదరాబాద్ లో భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఉన్న సునీత… వారిని వదిలిపెట్టి,  తిరువనంతపురంలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా జాయిన్ అవుతుంది.  అక్కడా ఓ ఫ్లాట్ ని అద్దెకు తీసుకొని ప్రేమ్ కుమార్ తో కలిసి సహజీవనం మొదలుపెట్టింది. వీరి రెండు కుటుంబాల్లో వీరిపై అనుమానం రావడంతో ప్రేమ్ కుమార్ భార్య విద్య అతని నుంచి విడాకులు కోరుతుంది.

కేవలం విడాకులు తీసుకుంటే చాలదని, పర్మినెంట్ గా విద్యను తొలగించేందుకు ప్లాన్ వేశారు ఇద్దరూ. అందుకు వారు ఎంచుకున్న సినిమా దృశ్యం. ఆ సినిమాలో చూపించినట్టుగా చంపిన తర్వాత ఆ మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ కి సంబంధించిన భూమిలో పాతిపెడితే ఎవరికి ఏ అనుమానం రాదన్నది వారి ఆలోచన. ప్లాన్ ప్రకారం సెప్టెంబర్ 11 న తన అద్దె ఇంటికి తీసుకెళ్లి ప్రియుడు ప్రేమ్ తో కలసి విద్య గొంతు కోసి చంపింది సునీత. ఆ తర్వాత శవాన్ని తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని వల్లియూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ ఏకాంత ప్రదేశంలో ఖననం చేశారు.

ఆ తర్వాత అక్కడ అధికారులు తమ పీఎస్ సమీపంలో ఓ మృతదేహం పూడ్చబడి ఉండడాన్ని కనుగొన్నారు. గుర్తు తెలియని శవంగా  లేబుల్ వేసి, ఆ మృతదేహాన్ని రికార్డుల్లోకి ఎక్కించేశారు. కొంతకాలం తర్వాత ప్రేమ్ కుమార్ తన భార్య తప్పిపోయిందని కేరళ పీఎస్ లో కంప్లయింట్ ఇచ్చాడు. రికార్డులోకెక్కిన మృతదేహాం, అతని భార్య ఒకే రకం గుర్తులు ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు తమ స్టైల్ లో ప్రేమ్, సునీత లను ప్రశ్నించారు. వేరే దారి లేక తాము చేసిన నేరాన్ని ఒప్పుకొని జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు.

Tamil movie leads to rekindling of forgotten affair, Hindi film influences murder plot