తప్పిపోతే వెతికి పెడుతుంది

తప్పిపోతే వెతికి పెడుతుంది

పిల్లలు తప్పిపోతే వాళ్లు ఎక్కడున్నారో తెలియక చాలా బాధపడుతుంటారు తల్లిదండ్రులు. వాళ్ల జాడ వెతుకుతూ న్యూస్​ పేపర్‌‌‌‌, టీవీల్లో యాడ్స్‌‌ ఇస్తారు. పాంప్లెట్లు పంచుతారు. వాళ్ల వివరాలు చెప్తూ అన్ని చోట్లా నోటీసులు అతికిస్తారు. అయితే ఆ తల్లిదండ్రులకు సాయం అయ్యేలా ఇన్‌‌స్టాగ్రామ్‌‌ ఒక ఫీచర్‌‌‌‌ని తీసుకొస్తోంది. అదే యాంబర్​ అలర్ట్​.

రోజూ ఇన్‌‌స్టాగ్రామ్‌‌ స్క్రోల్‌‌ చేసేవాళ్లకి ఇక నుంచి యాంబర్‌‌‌‌ అలర్ట్‌‌ అనే ఫీచర్​ కనిపించబోతోంది. తప్పిపోయిన పిల్లల్ని వెతికేందుకు ఈ ఫీచర్‌‌‌‌ సాయపడుతుంది. అంటే ఇన్‌‌స్టాగ్రామ్‌‌ హోమ్‌‌లో స్క్రోల్‌‌ చేస్తున్నప్పుడు ‘మీ ప్రాంతంలో ఫలానా పిల్లలు తప్పిపోయారు’ అని వాళ్ల ఫొటోని చూపెడుతుంది. దానికింద వాళ్ల వివరాలతో పాటు తల్లిదండ్రుల కాంటాక్ట్ డిటెయిల్స్‌‌ని ఇస్తుంది. ఇలాంటి న్యూస్‌‌ సోషల్‌‌ మీడియా ద్వారా తొందరగా స్ప్రెడ్ అయి వాళ్ల జాడ ఇంకా తొందరగా తెలిసే అవకాశం ఉందని ఇన్‌‌స్టాగ్రామ్‌‌ అంటోంది.

మిడ్‌‌ రేంజ్‌‌ ఫ్లాగ్‌‌షిప్‌‌ కిల్లర్‌‌‌‌ 
ఐక్యూ కంపెనీ మన దేశంలో ఐక్యూ నియో సిక్స్‌‌ 5జి మిడ్‌‌ రేంజ్‌‌ మొబైల్‌‌ లాంచ్‌‌ చేసింది. దీని ధర 30,000 ల రూపాయల నుంచి మొదలవుతుంది. ఈ ప్రైజ్‌‌ రేంజ్‌‌లో ఇదే కిల్లర్‌‌‌‌ ఫోన్‌‌ అంటున్నారు టెక్‌‌ స్పెషలిస్ట్‌‌లు. 8జీబి ర్యామ్‌‌ 128జీబి ఇంటర్నల్‌‌ స్టోరేజ్‌‌, 12జీబి ర్యామ్‌‌ 256జీబి వేరియెంట్లలో వస్తున్నాయి. 6.62 ఫుల్‌‌ హెచ్‌‌డి ప్లస్‌‌ అమోల్డ్‌‌ డిస్‌‌ప్లే, ఆండ్రాయిడ్‌‌ 12, ఫన్‌‌టచ్‌‌ ఓఎస్‌‌ 12తో కూడా ఉన్నాయి. ప్రైమరీ కెమెరా 64ఎంపి శాంసంగ్‌‌ సెన్సర్‌‌, 8 ఎంపి వైడ్‌‌ యాంగిల్‌‌ కెమెరా, 2 ఎంపి మాక్రో కెమెరా, ఫ్రంట్‌‌ 16 ఎంపి కెమెరాలు ఉంటాయి ఇందులో. వీటితో పాటు స్నాప్‌‌డ్రాగన్‌‌ 870 ప్రాసెసర్‌‌‌‌, 4700 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ, 80 వాట్‌‌ ఫ్లాష్‌‌ ఛార్జర్‌‌ ‌‌కూడా ఉన్నాయి. 

కెమెరాల్లో కొత్త కంపెనీ
ఎన్నో ఏండ్ల నుంచి కెమెరా, కెమెరా లెన్స్‌‌ తయారుచేస్తున్నాయి లైకా, ప్యానసోనిక్‌‌ (ల్యూమిక్స్‌‌) కంపెనీలు. ఇప్పుడు ఈ రెండు కంపెనీలు కలిసి పార్ట్‌‌నర్‌‌‌‌షిప్‌‌లో కెమెరా, కెమెరా లెన్స్‌‌ను తీసుకురానున్నాయి.  ప్యానసోనిక్ వాళ్ల ల్యూమిక్స్‌‌, లైకా ఈ రెండు పేర్లు కలిసేలా దీనికి ‘ఎల్‌‌ స్క్వేర్‌‌’‌‌ టెక్నాలజీ అని పేరు పెట్టారు. ‘మా టెక్నాలజీతో తక్కువ  రేంజ్‌‌ కెమెరాలో కూడా మంచి ఫోకస్, ఫొటో క్లారిటీ వచ్చేలా ఎల్‌‌ స్క్వేర్‌‌ డెవలప్‌‌ చేస్తున్నాం’ అంటున్నాడు లైకా కంపెనీ సీఈఓ మాథియాస్‌‌ హార్ష్‌‌.

వీడియోతో చీర్‌‌‌‌ చేయొచ్చు
ఫన్నీగా ఫొటోలు తీసుకునేందుకు స్నాప్‌‌ చాట్‌‌ కొత్త కొత్త కెమెరా ఫిల్టర్లను తీసుకొస్తుంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ‘డైనమిక్ క్రికెట్‌‌ ఎఆర్‌‌‌‌ లెన్స్‌‌’ అని మరొక కొత్త ఫిల్టర్‌‌‌‌ తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌‌‌‌ డెవలప్‌‌ చేయడానికి స్పోటిఫైతో పార్ట్‌‌నర్‌‌‌‌షిప్‌‌ తీసుకుంది స్నాప్‌‌చాట్‌‌. ఈ ఫిల్టర్‌‌‌‌ స్పెషాలిటీ ఏంటంటే.. ఫేవరెట్‌‌ క్రికెట్‌‌ మ్యాచ్‌‌ వస్తున్నప్పుడు, మ్యాచ్‌‌లోని క్షణాలను ఈ ఫిల్టర్‌‌‌‌తో పంచుకోవచ్చు. స్క్రీన్‌‌లో లైవ్‌‌ స్కోర్‌‌‌‌ కనపడుతుంటుంది. ఎవరైనా సిక్స్‌‌, ఫోర్‌‌‌‌ కొట్టినా, వికెట్‌‌ తీసినా మన ఆనందాన్ని, బాధను ఈ ఫిల్టర్‌‌‌‌ పెట్టుకొని వీడియో తీసుకోవచ్చు. ఆ వీడియో మనకు కావాల్సిన వాళ్లకి షేర్‌‌‌‌ చేసుకోవచ్చు కూడా. వీడియోలో చీర్‌‌‌‌ చేస్తున్నట్టు, ముఖానికి జెండా రంగు వచ్చేలా ఎఫెక్ట్స్‌‌ ఇవ్వొచ్చు. నచ్చిన పాట కూడా స్పోటిఫై నుంచి దీనికి యాడ్‌‌ చేసుకోవచ్చు. 

ఆక్సిజన్‌‌ ఓఎస్‌‌ వచ్చేస్తోంది
వన్‌‌ప్లస్‌‌ మొబైల్స్‌‌కి అంత బ్రాండ్ వాల్యూ రావడానికి ఆక్సిజన్‌‌ ఓఎస్‌‌ యూఐ‌‌ కూడా ఒక కారణం. యాడ్‌‌ ఫ్రీ, క్లీన్ యూజర్‌‌‌‌ ఎక్సపీరియెన్స్‌‌ ఇస్తుంది ఆక్సిజన్‌‌ ఓఎస్‌‌. అయితే ఈ మధ్య ఒప్పోతో పార్ట్‌‌నర్‌‌‌‌షిప్‌‌ తీసుకొని ఆక్సిజన్‌‌ ఓఎస్‌‌ను ఒప్పో వాళ్ల కలర్‌‌‌‌ ఓఎస్‌‌తో కలిపేసింది వన్‌‌ప్లస్‌‌. ఈ విషయం పైన కస్టమర్ల నుంచి నెగెటివ్‌‌ ఫీడ్ బ్యాక్‌‌ రావడంతో ఒక పోల్‌‌ను పెట్టింది వన్‌‌ప్లస్‌‌. దీంట్లో ‘వన్‌‌ప్లస్‌‌ ఫోన్లలో ఆక్సిజన్‌‌ ఓఎస్‌‌ సెపరేట్‌‌గా కావాలా లేక కలర్‌‌‌‌ ఓఎస్‌‌తో కలిపి తీసుకురావాలా?’ అని కస్టమర్‌‌‌‌లను అడిగింది. అన్ని ఓట్లు ఆక్సిజన్‌‌ ఓఎస్‌‌కు పడటంతో వాళ్ల తరువాత అప్‌‌డేట్‌‌లో మొత్తం వన్‌‌ప్లస్‌‌ మొబైల్స్‌‌కు ఆక్సిజన్‌‌ ఓఎస్‌‌ తీసుకొస్తామని చెప్పింది వన్‌‌ప్లస్‌‌.