
ఇన్స్టాగ్రామ్ లైవ్-స్ట్రీమింగ్‌పై కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇది చిన్న కంటెంట్ క్రియేటర్లు, యూజర్లపై ప్రభావం చూపనుంది. ఈ కొత్త రూల్స్ తో ఎవరు ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చో తెలుసుకుందాం..
ఇన్ స్టాగ్రామ్ లో ఇటీవల జరిగిన అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే పబ్లిక్ ఖాతాలకు వెయ్యి మంది అనుచరులు ఉండాలనే నిబంధన. గతంలో ఇన్ స్టాగ్రామ్ ఖాతా ఉన్న చిన్న కంటెంట్ క్రియేటర్లు కూడా లైవ్ స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం ఉండేది..ఇప్పుడు అలా లేదు. వెయ్యికి పైగా ఫాలోవర్స్ ఉంటేనే లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి అర్హులు.
కొత్త రూల్స్ ప్రకారం.. 16ఏళ్ల లోపు వయసుగల యూజర్లకు లైవ్ స్ట్రీమింగ్ ఆప్షన్ డీఫాల్ట్ గా ఆఫ్ లో ఉంటుంది. ఈ ఫీచర్‌ను ప్రారంభించడానికి వారికి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతి అవసరం.16నుంచి 17 ఏళ్ల వయస్సుగల టీనేజర్లకు పేరెంట్స్ అనుమతి లేకుండా లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు.
ప్రొఫెషనల్ ఖాతాలు (డెస్క్‌టాప్ స్ట్రీమింగ్ కోసం): డెస్క్‌టాప్ నుంచి OBS స్టూడియో లేదా రీస్ట్రీమ్ స్టూడియో వంటి స్ట్రీమింగ్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ప్రత్యక్ష ప్రసారం చేయాలనుకుంటే ప్రొఫెషనల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అవసరం. దీనికి ఫాలోయర్ అవసరం లేదు. కానీ మీరు మీ సాధారణ ప్రేక్షకులకు స్ట్రీమ్ చేయాలనుకుంటే మీరు ఇప్పటికీ పబ్లిక్ ఖాతా ఫాలోయర్ అవసరాన్ని తీర్చాలి.
మీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లైవ్ స్ట్రీమింగ్ కావడానికి కనీసం 30 రోజుల పాతది అయి ఉండాలి. మీ ఫోన్ కెమెరా,మైక్రోఫోన్‌కు Instagram యాక్సెస్‌ను పర్మిషన్ ఇవ్వాలి.
మీ ఖాతాలో Instagram కమ్యూనిటీ ప్రమాణాలకు సంబంధించి ఎటువంటి ఉల్లంఘనలు ఉండకూడదు. గతంలో కంటెంట్ తొలగింపులు జరిగిన ఖాతాలు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతి లేదు.
ఫాలోవర్స్ థ్రెషోల్డ్ (1,000 మంది ఫాలోవర్స్ ): ఇది అత్యంత ముఖ్యమైన మార్పు. లైవ్ స్ట్రీమింగ్ అనేది వనరులతో కూడుకున్నది. ఎక్కువ మంది ప్రేక్షకులు ఉన్న ఖాతాలకు పరిమితం చేయడం సర్వర్ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడానికి ఒక మార్గం కావచ్చు.
పెరుగుతున్న ప్రేక్షకులతో లేదా మరింత సన్నిహిత సెషన్‌ల కోసం లైవ్‌ను ఉపయోగించిన చిన్న కంటెంట్ క్రియేటర్లకు ఇది ఎదురుదెబ్బ.వెయ్యి మంది ఫాలోవర్స్ లిమిట్స్ ను చేరుకునేందుకు వారు ఇప్పుడు తమ అనుచరుల సంఖ్యను పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి.
న్‌స్టాగ్రామ్ లైవ్ రియల్-టైమ్ ఎంటర్ టైన్ మెంట్ కు శక్తివంతమైన సాధనంగా ఉన్నప్పటికీ ఇటీవలి మార్పులు ఖాతాలకు ప్రాధాన్యత ఇవ్వడం,యువ యూజర్లకు సురక్షితమైన వాతావరణాన్ని నిర్ధారించేందుకు ఈ మార్పు అని సూచిస్తున్నాయి.