ప్రధానికి అవమానం: స్కూల్‌‌‌‌‌‌‌‌పై దేశద్రోహం కేసు

ప్రధానికి అవమానం: స్కూల్‌‌‌‌‌‌‌‌పై దేశద్రోహం కేసు
  • బీదర్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌పై దేశద్రోహం కేసు
  • డ్రామాలో ప్రధానిని అవమానించారని ఆరోపణ
  • 4 గంటల పాటు స్టూడెంట్స్‌‌ను ప్రశ్నించిన పోలీసులు
  • ప్రభుత్వం తీరును తప్పుపట్టిన కాంగ్రెస్

బీదర్ (కర్నాటక): కర్నాటకలోని బీదర్ లో ఓ స్కూల్ పై దేశద్రోహం కేసు దర్యాప్తులో పోలీసులు స్పీడ్ పెంచారు. గత నెల 21న సీఏఏకు వ్యతిరేకంగా షాహీన్ స్కూల్ లో వేసిన డ్రామాలో ప్రధాని నరేంద్ర మోడీ, ఇతరులను అవమానించారనే ఆరోపణలపై స్కూల్ యాజమాన్యం, సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.  గత నెల 28న పోలీసులు యూనిఫామ్ లో స్కూల్ కు వెళ్లి ఎంక్వైరీ చేయడంపై విమర్శలు వచ్చాయి. దీంతో మంగళవారం పోలీసులు సివిల్ డ్రెస్ లో స్కూల్ కు వెళ్లారు. 4 గంటల పాటు స్టూడెంట్స్‌‌ను, స్టాఫ్‌ను పోలీసులు ప్రశ్నించారు. “ఇద్దరు చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ మెంబర్స్ తో కలిసి ఉదయం పోలీసులు వచ్చారు. తర్వాత డీఎస్పీ వచ్చి ఎంక్వైరీ చేశారు” అని అధికారులు చెప్పారు.

డ్రామాకు  స్క్రిప్ట్ ఎవరు రాశారు అన్నదానిపై స్కూల్ పిల్లలు, సిబ్బందిని పోలీసులు విచారించారు. వివాదాస్పద డైలాగ్ చెప్పిన పిల్లవాడి తల్లి నజ్బున్నీసా, టీచర్ ఫరీదా బేగమ్ ను పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు. ఈ కేసులో బీజేపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ తప్పుపట్టింది. చీటికిమాటికి ప్రజలపై దేశద్రోహం కేసులు నమోదు చేయడంపై కేంద్రం, కర్నాటక ప్రభుత్వాలను కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి యూటీ ఖాదర్ బెంగళూరులో విమర్శించారు. ఇద్దరు మహిళలను అరెస్టు చేసి, స్కూల్ పిల్లలను పోలీస్ స్టేషన్ లో కూర్చోపెట్టి విచారణ చేశారని ఆయన మండిపడ్డారు.

మరిన్ని వార్తల కోసం..