రాహుల్, మయాంక్‌ను కాదంటే పంత్‌ను అవమానించినట్లే

రాహుల్, మయాంక్‌ను కాదంటే పంత్‌ను అవమానించినట్లే

వరల్ట్ టెస్ట్ సిరీస్‌ ఫైనల్ ఓటమి నుంచి టీమిండియా ఇంకా తేరుకోలేదు. అయినప్పటికీ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు రెడీ అవుతోంది. అయితే న్యూజిలాండ్‌తో కీలక మ్యాచ్‌లో ఓటమి తర్వాత ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం జట్టులో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. గాయపడిన ఓపెనర్ శుభ్‌‌మన్ గిల్‌ స్థానంలో శ్రీలంక సిరీస్‌లో ఆడనున్న యంగ్ ఓపెనర్ పృథ్వీ షాను ఇంగ్లండ్‌కు రప్పించనున్నారు. ఈ విషయంపై లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించాడు. జట్టులో ఉన్న ప్లేయర్లపై నమ్మకం ఉంచకుండా అదనంగా మరో బ్యాట్స్‌మన్‌ను రప్పించడం సరికాదని కపిల్ దేవ్ ఫైర్ అయ్యాడు.

‘ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం పృథ్వీ షాను లంక నుంచి రప్పించడం సరికాదు. సెలెక్టర్ల ఎంపిక, నిర్ణయాలను కూడా గౌరవించాలి. కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీకి తెలియకుండా జట్టునైతే ఎన్నుకోరుగా? అయినా కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ రూపంలో ఇద్దరు బలమైన ఓపెనర్లు ప్రత్యామ్నాయంగా ఉన్నప్పుడు షాను రప్పించడం అవసరమా? మూడో ప్రత్యామ్నాయం అవసరమా? సెలెక్టర్లు ఎంపిక చేసిన జట్టులో ప్రత్యామ్నాయ ఓపెనర్లు కూడా ఉన్నారు. వాళ్లను కాదని మరొకర్ని రప్పించడం అంటే ఇది అవమానించట్లే’ అని కపిల్ దేవ్ విమర్శించాడు. 

మరిన్ని వార్తలు