బంపరాఫర్ : పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ. లక్షా 51వేల జీతం

బంపరాఫర్ : పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ. లక్షా 51వేల జీతం

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో ఉద్యోగం చేయాలనేది చాలామందికి ఓ డ్రీమ్. అయితే ఇప్పుడు ఆ కలను నెరవేర్చుకునే సమయం వచ్చింది. ఐబీలో మొత్తం 660 వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వివరాల్లోకి వెళ్తే...

 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే ఖచ్చితమైన ప్రణాళికతో చదవాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. కేంద్ర స్థాయిలో తరచూ కొలువుల భర్తీ జరుగుతూనే ఉంటుంది. ఒక ప్రణాళిక ప్రకారం చదివితే కేంద్ర కొలువు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. తాజాగా కేంద్ర హోంశాఖకు చెందిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే పోస్టు స్థాయిని అనుసరించి గరిష్ఠంగా నెలకు రూ.1,51,000 జీతం అందుకోవచ్చు.

ఇంటెలిజెన్స్ బ్యూరో మొత్తం 660 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ 660 ఉద్యోగాల్లో వివిధ రకాల పోస్టులు ఉన్నాయి. పోస్టుల స్థాయిని బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో మే 30 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం mha.gov.in వెబ్ సైట్‌ను చూడాలి. 

పోస్టుల వివరాలు

 • అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-I/ఎగ్జిక్యూటివ్ – 80
 • అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-II/ఎగ్జిక్యూటివ్ – 136
 • జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ I/ఎగ్జిక్యూటివ్ – 120
 • జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ II/ఎగ్జిక్యూటివ్ – 170
 • సెక్యూరిటీ అసిస్టెంట్ /ఎగ్జిక్యూటివ్ – 100
 • జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ II/టెక్ – 8
 • అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్II/సివిల్ వర్క్స్ – 3
 • జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ I/మోటార్ ట్రాన్స్ పోర్ట్ – 22
 • కుక్ – 10
 • కేర్‌టేకర్ – 5
 • పర్సనల్ అసిస్టెంట్ – 5
 • ప్రింటింగ్- ప్రెస్-ఆపరేటర్ – 1

మొత్తం పోస్టుల సంఖ్య :  660

అర్హత : పై ఉద్యోగాలకు పోస్టులను బట్టి అర్హతలు వేర్వేరుగా ఉన్నాయి. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదవి సంబంధిత విభాగాల్లో అనుభవం కలిగి ఉన్న వాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ పోస్టులకు ఏ అర్హతలు కావాలి అనేది నోటిఫికేషన్‌లో వివరంగా ఉన్నాయి.


వయోపరిమితి : దరఖాస్తు చేసుకునే సమయానికి అభ్యర్థుల వయస్సు గరిష్ఠంగా 56 ఏండ్లకు మించకూడదు.

జీతాలు

 • అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-I/ఎగ్జిక్యూటివ్ (లెవల్ 8) : రూ.47,600 నుంచి రూ.1,51,100
 • అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-II/ఎగ్జిక్యూటివ్ (లెవల్ 7) : రూ.44,900 నుంచి రూ.1,42,400
 • జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ I/ఎగ్జిక్యూటివ్ (లెవల్ 5) : రూ.29,200 నుంచి రూ.92,300
 • జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ II/ఎగ్జిక్యూటివ్ (స్థాయి 4) : రూ.25,500 నుంచి రూ.81,100
 • సెక్యూరిటీ అసిస్టెంట్ /ఎగ్జిక్యూటివ్ (లెవల్ 3) : రూ.21,700 నుంచి రూ.69,100
 • జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ II/టెక్ (లెవల్ 4) : రూ.25,500 నుంచి రూ.81,100
 • అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్II/సివిల్ వర్క్స్ (లెవల్ 7) : రూ.44,900 నుంచి రూ.1,42,400
 • జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ I/మోటార్ ట్రాన్స్ పోర్ట్ (లెవల్ 5) : రూ.29,200 నుంచి రూ.92,300
 • కుక్ (లెవల్ 3) : రూ.21,700 నుంచి రూ.69,100
 • కేర్‌టేకర్ (లెవల్ 5) : రూ.29,200 నుంచి రూ.92,300
 • పర్సనల్ అసిస్టెంట్ : రూ.44,900 నుంచి రూ.1,42,400
 • ప్రింటింగ్ ప్రెస్ ఆపరేటర్ (లెవల్ 2) : రూ.19,900 నుంచి రూ.63,200

దరఖాస్తు విధానం : ఆన్ లైన్

చివరి తేదీ: 30‌‌-05-2024
 

మరిన్ని వార్తలు