ఢిల్లీలో పేలుళ్లకు కుట్ర

ఢిల్లీలో పేలుళ్లకు కుట్ర

మళ్లీ యాక్టివ్​ అయిన ఖలిస్తానీ స్లీపర్​ సెల్స్​
ఇంటెలిజెన్స్​ ఏజెన్సీల వార్నింగ్​

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లకు ఖలిస్తానీ ఉగ్రవాదులు కుట్ర పన్నారని నిఘా వర్గాలు వార్నింగ్​ ఇచ్చాయి. ఢిల్లీ – ఎన్​సీఆర్​ ప్రాంతంలో ఖలిస్తానీ స్లీపర్​ సెల్స్​ మళ్లీ యాక్టివ్​ అయ్యాయని వెల్లడించాయి. మరోవైపు వికాస్​ పురి, జనక్​ పురి, పశ్చిమ విహార్​, పీరాగడి సహా పశ్చిమ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గోడలపై ఖలిస్తానీ ఉగ్రవాదులను సమర్ధిస్తూ ఈనెల 12న  పోస్టర్లు వెలిశాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాటిని  తీయించారు. ఆయా ఏరియాల్లోని సీసీ ఫుటేజీల ఆధారంగా పోస్టర్లు అంటించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, విచారించారు. దీంతో యాంటీ నేషనల్​ యాక్టివిటీస్​ చేసేందుకు తమకు నిధులు అందాయని  వారు చెప్పారు.  ఇద్దరు నిందితులపై ఐపీసీ 153బీ, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.