ఇంట్లో హాల్ టికెట్ పెట్టి ఎగ్జామ్కు వచ్చిండు

ఇంట్లో హాల్ టికెట్ పెట్టి ఎగ్జామ్కు వచ్చిండు

కాలేజీకి ఎప్పుడు లేటే.. ఇవాళ పరీక్షకు ఆలస్యమే.. పరీక్షకు లేటుగా రావడమే కాకుండా హాల్ టికెట్ కూడా మరిచిపోయి వచ్చాడు. ఇది విద్యార్థి సంగతి అయితే...  ఆ కాలేజీ ప్రిన్సిపాల్ బాధ వర్ణనాతీతం..వీడు మొదటినుంచి ఇంతే.. ఏడాది నుంచి లెక్చరర్లను వేధించేవాడని ప్రిన్సిపాల్ అవేదన. ఈ ఘటన ఏపీలో జరిగింది. ఇంటర్ పరీక్షకు చివరి నిమిషంలో పరిగెత్తుకుంటూ వచ్చాడు విద్యార్థి. పరీక్షకు లేటు అయినప్పటికీ అనుమతించారు. తీరా హాల్ టికెట్ ఏదీ అంటే ఇంట్లో ఉందని సమాధానం ఇచ్చాడు.  వీడు మొదటినుంచి ఇంతే అంటూ హాల్ టికెట్ తాను ఇస్తానని ఇంటర్ బోర్డు అధికారిని రిక్వెస్ట్ చేసింది ప్రిన్సిపాల్.

ఇక తెలంగాణలో గూగుల్ మ్యాప్ను నమ్ముకుని పరీక్ష కేంద్రానికి చేరుకోవాలనుకున్న ఓ ఇంటర్ విద్యార్థికి చుక్కెదురైంది .సెంటర్ లోకేషన్ కాకుండా అది మరెక్కడికో తీసుకెళ్లింది. ఈ ఘటన  ఖమ్మం జిల్లాలోని ఎన్.ఎస్.పి  ప్రభుత్వ పాఠశాలలో  చోటుచేసుకుంది. ఖమ్మంలోని  కొండాపురం గ్రామానికి చెందిన  వినయ్ అనే ఇంటర్మీడియట్ విద్యార్థి గూగుల్ మ్యాప్ సహకారంతో పరీక్షా కేంద్రానికి బయలుదేరాడు . కానీ గూగుల్ మ్యాప్ అతను చేరుకోవాల్సిన సెంటర్ కాకుండా వేరే లొకేషన్ ను తీసుకెళ్లింది.  తిరిగి అక్కడి నుంచి ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లేలోపు 27 నిమిషాల ఆలస్యం అయింది. దీంతో అతన్ని పరీక్ష రాసేందుకు  సిబ్బంది లోపలికి అనుమతించలేదు.  దీంతో చేసేది ఏమీ లేక అతను నిరాశతో ఇంటికి వెళ్లిపోయాడు.