గూగుల్ మ్యాప్ను నమ్ముకుని పోతే ఎగ్జామ్ మిస్

గూగుల్ మ్యాప్ను నమ్ముకుని పోతే ఎగ్జామ్ మిస్

గూగుల్ మ్యాప్ను నమ్ముకుని పరీక్ష కేంద్రానికి చేరుకోవాలనుకున్న ఓ ఇంటర్ విద్యార్థికి చుక్కెదురైంది .సెంటర్ లోకేషన్ కాకుండా అది మరెక్కడికో తీసుకెళ్లింది. ఈ ఘటన  ఖమ్మం జిల్లాలోని ఎన్.ఎస్.పి  ప్రభుత్వ పాఠశాలలో  చోటుచేసుకుంది. ఖమ్మంలోని  కొండాపురం గ్రామానికి చెందిన  వినయ్ అనే ఇంటర్మీడియట్ విద్యార్థి గూగుల్ మ్యాప్ సహకారంతో పరీక్షా కేంద్రానికి బయలుదేరాడు . కానీ గూగుల్ మ్యాప్ అతను చేరుకోవాల్సిన సెంటర్ కాకుండా వేరే లొకేషన్ ను తీసుకెళ్లింది.  తిరిగి అక్కడి నుంచి ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లేలోపు 27 నిమిషాల ఆలస్యం అయింది.

దీంతో అతన్ని పరీక్ష రాసేందుకు  సిబ్బంది లోపలికి అనుమతించలేదు.  దీంతో చేసేది ఏమీ లేక అతను నిరాశతో ఇంటికి వెళ్లిపోయాడు. పరీక్ష ముందు రోజు సెంటర్ కు వెళ్లి చూసుకోవాలని లేకపోతే ఇలాంటి నష్టాలు జరుగుతాయని పలువురు హెచ్చరిస్తున్నారు. పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా రావొద్దని ముందు నుంచే విద్యాశాఖ అధికారులు చెబుతూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు మార్చి 12నుంచి స్టార్ట్ అయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష నిర్వహించారు. దీంతో ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పలుచోట్లలో లేటుగా వచ్చిన విద్యార్థులను లోపలికి అనుమతించలేదు.