ఇంటర్ స్టూడెంట్ సూసైడ్ .. పెద్దపల్లి జిల్లా కేంద్రం పరిధిలో ఘటన

ఇంటర్ స్టూడెంట్ సూసైడ్ .. పెద్దపల్లి జిల్లా కేంద్రం పరిధిలో ఘటన
  • మృతుడి తల్లి  మార్కెట్​ కమిటీ చైర్​ పర్సన్​

పెద్దపల్లి, వెలుగు: ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్​కమిటీ చైర్​పర్సన్​ఈర్ల స్వరూప, సురేందర్ దంపతుల కొడుకు విశ్వతేజ(17)  మంగళవారం రాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు. ఎంత వెతికినా ఫలితం లేకపోయింది.  బుధవారం పెద్దపల్లి టౌన్ పరిధి బంధంపల్లిలోని వ్యవసాయ బావిలో డెడ్ బాడీ ఉందనే సమాచారంతో మున్సిపల్ ​సిబ్బంది, పోలీసులు వెళ్లారు. బావిలోంచి డెడ్ బాడీని బయటకు తీసి విశ్వతేజగా గుర్తించారు. అతని పేరెంట్స్ కు తెలపగా వచ్చి బోరున విలపించారు. కరీంనగర్​లోని ప్రైవేటు కాలేజీలో విశ్వతేజ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతడు హాస్టల్​కు వెళ్లనని పేరెంట్స్ తో చెప్పగా వారు ఒప్పుకోకపోవడంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. ఘటనా స్థలాన్ని పెద్దపల్లి సీఐ ప్రవీణ్​కుమార్, ఎస్ఐలు లక్ష్మణ్​కుమార్, మల్లేశ్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.