ఇంటర్ బోర్డు దగ్గర మళ్లీ టెన్షన్ : విద్యార్థుల అరెస్ట్

ఇంటర్ బోర్డు దగ్గర మళ్లీ టెన్షన్ : విద్యార్థుల అరెస్ట్

హైదరాబాద్ : ఇంటర్ బోర్డు దగ్గర టెన్షన్ కంటిన్యూ అవుతోంది. బుధవారం విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు…విద్యార్థి సంఘాల నేతలు వచ్చి నిరసనలు తెలుపుతుండటంతో సెక్యూరిటీ టైట్ చేశారు పోలీసులు. లోపలికి ఎవరిని అనుమతించటం లేదు. రీ వ్యాల్యువేషన్, రీ వేరిఫికేషన్ కావాలంటే ఆన్ లైన్లో అప్లై చేసుకోవాలని చెబుతున్నారు. అధికారుల తీరుపై బోర్డు కార్యాలయం దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ మండిపడుతున్నారు. మార్కుల్లో తప్పులు వస్తే….కనీసం అధికారులు సమాధానం ఇవ్వటం లేదంటున్నారు.

ఆన్ లైన్లో అప్లై చేసుకునేందుకు సైట్ ఓపెన్ కావటం లేదంటున్నారు విద్యార్థులు. రెండు రోజులు గడువు పెంచినా…టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండటంతో ఏం చేయలేకపోతున్నామంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి….సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. మంగళవారం ఇంటర్ బోర్డు అధికారులతో సమావేశమైన కమిటీ సభ్యులు.. బుధవారం సాయంత్రం నివేదిక ఇచ్చే అకకాశం ఉంది. ఇవాళ ప్రగతి భవన్ తో పాటు.. గ్లోబరీనా సంస్థ ముట్టడికి పిలుపునిచ్చాయి ప్రజా సంఘాలు. కలెక్టరేట్ల ముందు కూడా బీజేపీ నేతలు నిరసన తెలపనున్నారు.