నెలాఖరులోగా ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్ కు వడ్డీ జమ

నెలాఖరులోగా ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్ కు వడ్డీ జమ

ఫైనాన్స్‌‌ మినిస్ట్రీకి ప్రపోజల్స్‌‌ పంపిన లేబర్ మినిస్ట్రీ

న్యూఢిల్లీ: ఈ నెల చివరి నాటికి ఉద్యోగుల పీఎఫ్‌‌ అమౌంట్‌‌కు 8.5 శాతం వడ్డీని ఈపీఎఫ్‌‌ఓ యాడ్‌‌ చేయనుంది. 2019–20 కి సంబంధించి పీఎఫ్‌‌ వడ్డీ 8.5 శాతాన్ని (రెండు విడతల్లో 8.15 శాతం, 0.35 శాతం) ఇవ్వాలని ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌లో లేబర్ మినిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. ఈ 8.5 శాతం వడ్డీని ఇవ్వడంపై  ఆమోదం  కోరుతూ ప్రపోజల్స్‌‌ను ఈ నెల ప్రారంభంలో ఫైనాన్స్‌‌ మినిస్ట్రీకి లేబర్‌‌‌‌ మినిస్ట్రీ పంపింది. ఈ నెలలోనే ఈ ప్రపోజల్స్‌‌కు ఆమోదం దొరుకుతుందని, వడ్డీ కూడా ఇదే నెలలో పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఫైనాన్స్‌‌ మినిస్ట్రీ ఆమోదం దొరికితే  ముందుగా ప్లాన్ చేసినట్టు 8.15 శాతం వడ్డీని ఈపీఎఫ్‌‌ఓ సబ్‌‌స్క్రయిబర్లకు ఇవ్వనుంది. మిగిలిన 0.35 శాతం వడ్డీని కూడా ఈ నెలలోనే పీఎఫ్‌‌ అకౌంట్లకు యాడ్‌‌ చేయాలని చూస్తోంది.