నిమిషానికి ఎన్ని కోళ్లు తింటున్నామో తెలుసా..?

నిమిషానికి ఎన్ని కోళ్లు తింటున్నామో తెలుసా..?

కుక్కుటము అనే పేరుతో పిలిచే కోడి.. కొన్ని శతాబ్దాల నుంచే మన జీవితంలో భాగమైపోయింది. నాటు కోళ్లు, ఫారం కోళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే వివిధ జాతులకు చెందిన కోళ్లు చాలానే ఉంటాయి. మామూలుగా కోళ్లు అనగానే మంచి పోషకాలనిచ్చే నాన్ వెజ్ చికెన్ లేదా బిర్యానీ.. ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల్లో నిర్వహించే కోడి పందాలు.. అదీ కాకపోతే ఇళ్లలో పెంచుకునే పెంపుడు జంతువులాగానే అందరికీ తెలుసు. కానీ వాటికంటూ కొన్ని ప్రత్యేకతలున్నాయి. వాటికంటూ కొన్ని లక్షణాలు.. కొన్ని వైరైటీ అభిరుచులున్నాయి. అయితే కోళ్ల గురించి ఎప్పుడూ వినని, నమ్మలేని, ఆసక్తికర విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

1 భూమిపై మనుషుల కంటే ఎక్కువగా కోళ్లే ఉన్నాయి. కచ్చితంగా చెప్పాలంటే భూమ్మీద 25 బిలియన్లు కోళ్లున్నట్టు అంచనా. అంటే కోళ్లు కూడా ఇతర పక్షి జాతుల కంటే ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి.

2. కోళ్లకు జ్ఞాపకశక్తి ఎక్కువ. అవి మనుషుల్ని కూడా గుర్తుపడతాయని చాలా చోట్ల నమ్ముతారు. 

3. కోడి పెట్ట ఏడాదికి 300 కన్నా ఎక్కువ గుడ్లు పెట్టగలదు. 

4.  ఒక కోడి ఏడాదిలో పెట్టిన గుడ్లు ప్రస్తుత రికార్డు సంఖ్య 371.

5.  కోళ్ల పెంపకం దక్షిణ చైనాలో సుమారు 8000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది.

6. కోడిగుడ్డు రంగు కోడి చెవిలోబ్స్ (చెవి కమ్మ పెట్టుకునే భాగం) మీద ఆధారపడి ఉంటుంది. ఎరుపు లేదా ముదురు రంగు చెవిలోబ్స్ ఉన్న కోడి సాధారణంగా గోధుమ రంగు గుడ్లు పెడుతుందని అర్థం. తెల్లటి ఇయర్‌లోబ్స్ ఉన్న కోళ్లు సాధారణంగా తెల్లగుడ్లు పెడతాయి.

7. కోడి పెద్దదయ్యే కొద్దీ అవి పెట్టే గుడ్ల పరిమాణం కూడా పెరుగుతుంది. వయసులో పెద్ద కోళ్లు పెద్ద గుడ్లు పెడతాయి. 

8. కోళ్లు ఉప్పు రుచి తెలుసు. కానీ తీపిని గ్రహించలేవు.

9. గైనెస్‌విల్లే, జార్జియాలను 'ది పౌల్ట్రీ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్' గా పిలుస్తారు. ఇక్కడ చికెన్‌ తినే విషయంలో చాలా కఠినమైన చట్టాలు ఉంటాయి. అక్కడ ఫ్రైడ్ చికెన్ ను  చేయితోనే తినాలని చట్టం ఉంది. కత్తి, ఫోర్క్‌తో లేదా మరేదైనా పద్ధతిలో తినడం చట్టవిరుద్ధం.

10. ఒక కోడి ఒక డజను గుడ్లు ఉత్పత్తి చేసేందుకు దాదాపు నాలుగు పౌండ్ల మేత తినాలి.

11. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 1,16,400 కోళ్లు తింటున్నారు.

12. ఇండోనేషియోలో అరుదైన జాతికి చెందిన కోళ్లు హైపర్ పిగ్మెంటేషన్ కారణంగా పూర్తిగా నల్లగా ఉంటాయి. అయితే వీటిక్కూడా మిగతా కోళ్ల లాగే ఈకలు, ముక్కు, అవయవాలు ఉంటాయి. వీటిని 2,500 డాలర్లకు విక్రయిస్తారు.

13. దక్షిణ కొరియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌ల కంటే ఫ్రైడ్ చికెన్ రెస్టారెంట్‌ల సంఖ్య ఎక్కువ.

14. చికెన్ గన్.. అంటే విమానం కిటికీలు, ఇంజిన్ల నిరోధకతను పరీక్షించడానికి చేసే ప్రక్రియ. ఇది విమానాల వద్ద చనిపోయిన కోళ్లను కాల్చే ప్రక్రియ.

15. అడవి పుట్టగొడుగులు కూడా చికెన్ టేస్ట్ ను కలిగి ఉంటాయి. అందువల్లే వీటిని "ఫ్రైడ్ చికెన్ మష్రూమ్" అని కూడా పిలుస్తారు.

16. ఇప్పటి వరకు ఒక గుడ్డులో అత్యధికంగా 9 గుడ్డు సొనలు గుర్తించారు. రెండు సొనలతో, 12 ఔన్సుల (340 గ్రాములు) బరువు కలిగిన గుడ్డు అతిపెద్ద కోడి గుడ్డుగా రికార్డులకెక్కింది.

17. యునైటెడ్ స్టేట్స్ లో ఏడాదికి  8 బిలియన్ కోళ్లు తింటున్నారు. ఇది గొడ్డు మాంసం వినియోగం కంటే ఎక్కువ.

18.  కోడి శరీరంలో మానవ శరీరంలో కంటే 15% ఎక్కువ నీరు ఉంటుంది.

19. కోడి తల నరికిన తర్వాత కూడా ఫుట్‌బాల్ మైదానమంత దూరం పరిగెత్తగలదు.

20. కోళ్లను చూస్తే  భయపడటాన్ని అలెక్టోరోఫోబియా అంటారు.

21. “కోళ్లు ఎగరగలవా?” .. ఈ ప్రశ్నకు కాస్త తడబడుతూ అయినా.. కాస్త ఎత్తుకు ఎగరగలవు అని చెప్తారేమో.. కానీ 301 అడుగుల ఎత్తుకు 13 సెకన్ల పాటు సుదీర్ఘంగా ఎగిరిన ఓ కోడి రికార్డ్ సృష్టించాయి.

22. కోడి ఒత్తిడికి గురైనప్పుడు అది తన ఈకలను కోల్పోతుంది.

23. మటిల్డా జాతికి చెందిన కోడి అత్యంత ఎక్కువ కాలం జీవిస్తుంది. దీని జీవిత కాలం 16 సంవత్సరాలు. అంటే సగటు కోడి జీవితకాలం కంటే రెండు రెట్లు ఎక్కువ.

24. కోళ్లకు స్వంతంగా కొన్ని ప్రత్యేక భాషలుంటాయి. ఆ భాషల్లోనే అవి సంభాషించుకుంటాయి. ఇవి 30కి పైగా సౌండ్‌లు చేయగలవు.

25. తల్లి కోళ్లు గుడ్డులో ఉన్న పిల్లలతో మాట్లాడగలవు. కోళ్లు సర్వభక్షకాలు. ఆకలితో ఉంటే లేదా ఆహారంతో సంతృప్తి చెందకపోతే వాటి పచ్చి గుడ్లను కూడా తింటాయి.

26. శాస్త్రీయ సంగీతాన్ని వినే కోళ్లు  పెద్ద గుడ్లు పెడతాయంట. 

27.కోళ్లకు మూడో కనురెప్ప ఉంటుంది. దీనిని నిక్టిటేటింగ్ మెమ్బ్రేన్ అని పిలుస్తారు. ఇది కంటిపై అడ్డంగా ఉండి, దుమ్ము, దూళి నుండి రక్షిస్తుంది.

28.  కోళ్లు గుడ్లను సాధారణంగా ఉదయం 7 నుండి 11 గంటల మధ్యలో పెడతాయి.

29. కోడి ముక్కు చాలా సున్నితంగా ఉంటుంది.

30. పిల్లికి, కుక్కకు ఉన్న నైపుణ్యాలు, తెలివితేటలే కొన్ని కోళ్లకు కూడా ఉంటాయి.