మళ్ళీ టెంపుల్ సెట్టా.. ఏదో తేడా కొడుతోంది కొరటాల

మళ్ళీ టెంపుల్ సెట్టా.. ఏదో తేడా కొడుతోంది కొరటాల

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ దేవర. పాన్ ఇండియా లెవల్లో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ లుక్ చూసి సినిమా పక్క బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్స్ కూడా చేశారు.  

అయితే తాజాగా ఈ సినిమా నుండి వినిపిస్తున్న న్యూస్ ఒకటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కంగారుపెట్టిస్తోంది. అదేంటంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఇందులో ఒక భారీ యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్నారట. ఇందుకోసం భారీ టెంపుల్ సెట్ వేయించాడట కొరటాల. ఈ విషయం తెల్సుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ మెగాస్టార్ ఆచార్య సినిమాను గుర్తుచేసుకుంటున్నారు. ఆచార్య సినిమా కోసం కూడా కొరటాల భారీ టెంపుల్ సెట్ ను వేయించాడు. ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి దేవర కోసం టెంపుల్ సెట్ వేయించాడు కొరటాల. మరి ఈ సినిమా పరిస్థితి ఎలా ఉండబోతుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.