గూగుల్‌‌‌‌‌‌‌‌లో తెగ వెతుకుతున్న ఈ డైట్ మంచిదేనా?

గూగుల్‌‌‌‌‌‌‌‌లో తెగ వెతుకుతున్న ఈ డైట్ మంచిదేనా?

హైట్‌‌‌‌‌‌‌‌కి తగ్గ వెయిట్‌‌‌‌‌‌‌‌తో మనం ఫిట్‌‌‌‌‌‌‌‌గా ఉండాలనుకుంటాం దానికోసం రకరకాల డైట్లు ఫాలోఅవుతాం, ఎక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌‌‌‌‌లు చేస్తుంటాం. బరువు తగ్గడానికి చాలామంది ఇప్పుడు ‘ఇంటర్మిటెంట్‌‌‌‌‌‌‌‌ ఫాస్టింగ్‌‌‌‌‌‌‌‌’ను ప్రిఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. 2019 నుంచి దీని గురించి గూగుల్‌‌‌‌‌‌‌‌లో తెగ వెతుకుతున్నారు. ఇంతకీ ఈ డైట్‌‌‌‌‌‌‌‌ మంచిదేనా? దీనిపై జరిపిన రీసెర్చ్ రిపోర్ట్స్‌‌‌‌‌‌‌‌ ఏమంటున్నాయి?

ఒక్కపొద్దు ఉండటం మనదేశంలో చాలా కామన్‌‌‌‌‌‌‌‌. దాదాపు అన్ని మతాల్లోనూ ఈ ఆచారం ఉంటుంది. అయితే, అది పండగలకే పరిమితం. కానీ, ఇప్పుడు పండగలతో సంబంధం లేకుండా రోజూ ఒకపొద్దు ఉంటున్నారు. ఎందుకంటే బరువు తగ్గడానికని చెప్తున్నారు. ఇక, ‘ఇంటర్మిటెంట్‌‌‌‌‌‌‌‌ ఫాస్టింగ్‌‌‌‌‌‌‌‌’. అంటే.. అడపాదడపా అని అర్థం. అప్పుడప్పుడూ ఒక్కపొద్దు ఉంటూ బరువు తగ్గడం అన్నమాట! 

గంటలపాటు తినకుండా

ఇంటర్మిటెంట్‌‌‌‌‌‌‌‌ ఫాస్టింగ్ అంటే రోజులో చాలా గంటలపాటు తినకుండా ఉండటం. ఈ డైట్‌‌‌‌‌‌‌‌లో ఏం తింటున్నాం అనే దానికంటే.. ఏ టైమ్‌‌‌‌‌‌‌‌లో తింటున్నాం అనేది ఇంపార్టెంట్‌‌‌‌‌‌‌‌. ఈ డైట్‌‌‌‌‌‌‌‌లో మూడు పద్ధతులు ఉన్నాయి. 5:2 పద్ధతిలో వారంలో రెండు రోజులు సాధారణంగా తీసుకునే కేలరీల్లో కేవలం 25% మాత్రమే తీసుకుంటారు. మిగిలిన ఐదు రోజుల్లో ఎలాంటి రూల్స్ ఉండవు. అయితే, తక్కువ కేలరీలు తీసుకునే ఆ రెండు రోజులు కూడా వరుసగా ఉండకూడదు. ఇక రెండోది 16:8. ఈ పద్ధతిలో ఒక రోజులో తీసుకోవాల్సినది 8 గంటల్లో  ముగించి, మిగిలిన 16 గంటలు ఉపవాసం ఉండాలి. మూడో పద్ధతిలో వారానికి లేదా నెలకు ఒకరోజు అంటే 24 గంటల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. ఇలా ప్రతి డైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  భోజనానికి, భోజనానికి మధ్య పర్టిక్యులర్ గ్యాప్  ఇచ్చి, ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. అయితే ఇంటర్మిటెంట్‌‌‌‌‌‌‌‌ ఫాస్టింగ్‌‌‌‌‌‌‌‌ను ఎవరుపడితే వాళ్లు, ఎలాపడితే అలా ఫాలో అవకూడదని డాక్టర్లు చెప్తున్నారు. మన హెల్త్‌‌‌‌‌‌‌‌ కండిషన్‌‌‌‌‌‌‌‌కు తగ్గట్టు, బరువును బట్టి దీన్ని ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు.

ఎవరు చేయకూడదు

పాలు ఇచ్చే తల్లులు, టైప్‌‌‌‌‌‌‌‌ –1 డయాబెటిస్‌‌‌‌‌‌‌‌ ఉన్నవాళ్లు, అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెయిట్‌‌‌‌‌‌‌‌ ఉన్నవాళ్లు చేయకూడదు. వీక్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ ఉన్నవాళ్లు, 18 ఏండ్లు నిండనివాళ్లు కూడా చేయకూడదు.  ఈటింగ్‌‌‌‌‌‌‌‌ డిజార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నవాళ్లు అసలు ఈ డైట్‌‌‌‌‌‌‌‌ను ఫాలో అవ్వొద్దు.

సైడ్‌‌‌‌‌‌‌‌ ఎఫెక్ట్స్‌‌‌‌‌‌‌‌

ఆకలిలేకపోవడం

శరీరానికి ఎప్పుడూ మంచి ఫుడ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలి. అప్పుడే ఆరోగ్యంగా, యాక్టివ్‌‌‌‌‌‌‌‌గా ఉంటాం. కానీ, ఇంటర్మిటెంట్‌‌‌‌‌‌‌‌ ఫాస్టింగ్‌‌‌‌‌‌‌‌ వల్ల ఆకలి ఉండదని, న్యూట్రీషనల్‌‌‌‌‌‌‌‌ డెఫిసియన్సీ వస్తుందని స్టడీస్‌‌‌‌‌‌‌‌ చెప్తున్నాయి.  దాంతో అలసట, తలనొప్పి, నీరసం లాంటి సమస్యలు వస్తాయని తేలినట్లు రిపోర్ట్స్‌ వచ్చాయి.

నిద్రసరిగా పట్టకపోవడం

ఖాళీ కడుపుతో ఉంటే చాలామందికి నిద్రపట్టదు. ఈ ఫాస్టింగ్‌‌‌‌‌‌‌‌ చేయడం వల్ల అలాంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాత్రి ఏడు లేదా ఎనిమిది గంటల మధ్యలో డిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తే కొంతమందికి రాత్రిపూట ఆకలవుతుంటుంది.

ఇరిటేషన్‌‌‌‌‌‌‌‌

కార్బొహైడ్రేట్లు, ఫ్యాట్‌‌‌‌‌‌‌‌, ప్రొటీన్ల విషయంలో  ఇంటర్మిటెంట్‌‌‌‌‌‌‌‌ ఫాస్టింగ్‌‌‌‌‌‌‌‌ అనుకూలంగా ఉన్నప్పటికీ, కేలరీల ఇన్‌‌‌‌‌‌‌‌టేక్‌‌‌‌‌‌‌‌ విషయంలో రెస్ట్రిక్షన్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. బరువు తగ్గేందుకు, హెల్దీగా ఉండేందుకు తక్కువ కేలరీలు ఉన్న తిండి తినాల్సిన అవసరం ఉంది. దీంతో తినాలనే కోరిక (కార్వింగ్‌‌‌‌‌‌‌‌) పెరుగుతుంది. తినాలనుకున్నది తినకపోవడంతో మూడ్‌‌‌‌‌‌‌‌స్వింగ్స్‌‌‌‌‌‌‌‌, చిరాకు వస్తాయి. దీంతో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి.

మెటబాలిజమ్‌‌‌‌‌‌‌‌పై ప్రభావం

చాలా రోజలు ఫాస్టింగ్‌‌‌‌‌‌‌‌ ఉండటం, ఆ తర్వాత తినే దశలో తగినంత న్యూట్రీషన్‌‌‌‌‌‌‌‌ లేకపోవడం వల్ల ఇంటర్మిటెంట్‌‌‌‌‌‌‌‌ ఫాస్టింగ్‌‌‌‌‌‌‌‌ శరీర జీవక్రియను తగ్గిస్తుంది. ఇది మెటబాలిజంపై చాలా ప్రభావం చూపుతుంది. అందుకే టైప్‌‌‌‌‌‌‌‌–1 డయాబెటిస్‌‌‌‌‌‌‌‌ ఉన్నవాళ్లు, పాలు ఇచ్చే తల్లులు ఈ రకమైన డైట్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ను పాటించకపోవడం మంచిది.

కెఫిన్‌‌‌‌‌‌‌‌ రికమెండేషన్‌‌‌‌‌‌‌‌

కొంతమంది ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌ ఈరకమైన డైట్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువగా టీ లేదా కాఫీ రికమెండ్‌‌‌‌‌‌‌‌ చేస్తారు. దీనివల్ల కొన్ని గంటలపాటు ఆకలిలేకుండా ఉంటుంది. ఫాస్టింగ్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌లో అతిగా కాఫీ మీద ఆధారపడటం కూడా ఇంటర్మిటెంట్‌‌‌‌‌‌‌‌ ఫాస్టింగ్‌‌‌‌‌‌‌‌కి సంబంధించి ఒక సైడ్‌‌‌‌‌‌‌‌ ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌గా చెప్తారు.

అడ్వైజ్‌‌‌‌‌‌‌‌ తీసుకుని చేయడమే మేలు

డాక్టర్స్‌‌‌‌‌‌‌‌, డైటీషియన్‌‌‌‌‌‌‌‌ను సంప్రదించి ఒక పద్ధతిలో ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫాస్టింగ్‌‌‌‌‌‌‌‌ ఫాలో అవ్వాల్సిన వాళ్ల వెయిట్‌‌‌‌‌‌‌‌, హెల్త్‌‌‌‌‌‌‌‌ కండిషన్‌‌‌‌‌‌‌‌ను బట్టి డైట్‌‌‌‌‌‌‌‌ను, ఎంత టైం ఉపవాసం ఉండాలి అనే విషయాలను డాక్టర్స్‌‌‌‌‌‌‌‌ చెప్తారు. ఏవైనా సైడ్‌‌‌‌‌‌‌‌ ఎఫెక్ట్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నా వెంటనే క్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకునే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. ఎలాపడితే అలా ఫాస్టింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తే చాలా ప్రాబ్లమ్స్‌‌‌‌‌‌‌‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారిగా షుగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్స్‌‌‌‌‌‌‌‌ తగ్గిపోవడం, ప్రొటీన్స్‌‌‌‌‌‌‌‌, న్యూట్రియంట్స్​ అందక నీరసంగా ఉండటం లాంటివి జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. టైప్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌ డయాబెటిస్‌‌‌‌‌‌‌‌, అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెయిట్, 18 ఇయర్స్‌‌‌‌‌‌‌‌ లోపు వాళ్లు ఈ ఇంటర్మిటెంట్‌‌‌‌‌‌‌‌ ఫాస్టింగ్‌‌‌‌‌‌‌‌ అస్సలు చేయకూడదు. అలానే ఫాస్టింగ్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌లో ఎక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌‌‌‌‌ చేయకూడదు. విండో పీరియడ్‌‌‌‌‌‌‌‌లో మాత్రం కొన్ని చిన్న చిన్న ఎక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌‌‌‌‌లు చేయడమే ఉత్తమం. టైప్‌‌‌‌‌‌‌‌–2 షుగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేషెంట్స్‌‌‌‌‌‌‌‌, హైపోథైరాయిడ్‌‌‌‌‌‌‌‌, పీసీవోడీ ప్రాబ్లమ్స్‌‌‌‌‌‌‌‌, ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెయిట్‌‌‌‌‌‌‌‌ ఉన్నవాళ్లకు మాత్రం ఇంటర్మిటెంట్‌‌‌‌‌‌‌‌ ఫాస్టింగ్‌‌‌‌‌‌‌‌ బాగా పనిచేస్తుంది, కానీ వాళ్లు కూడా కచ్చితంగా డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సలహా తీసుకుంటేనే మంచి రిజల్ట్‌‌‌‌‌‌‌‌ వస్తుంది. ఫాస్టింగ్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌లో పర్ఫెక్ట్‌‌‌‌‌‌‌‌గా ఉండి, విండో పీరియడ్‌‌‌‌‌‌‌‌లో తెగ తినేయడం కూడా కరెక్ట్‌‌‌‌‌‌‌‌ కాదు. విండో పీరియడ్‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి ఫుడ్‌‌‌‌‌‌‌‌ తీసుకోవాలనే విషయంపై కూడా డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్వైజ్ ఫాలో అయితేనే మంచిది.

– డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జి.సుష్మ, చీఫ్‌‌‌‌‌‌‌‌ క్లినికల్‌‌‌‌‌‌‌‌ డైటీషియన్‌‌‌‌‌‌‌‌, కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌.

For More News..

ఫీజుల దందాపై మళ్లీ ఎంక్వైరీ

తెలంగాణలో కొత్తగా 1,891 కరోనా కేసులు

టీఆర్పీ రేటింగ్ కోసం ఇంటికి రూ.500 ఇస్తున్న టీవీ చానల్