కెప్టెన్సీ మార్పుపై ద్రవిడ్‌‌‌‌ నో కామెంట్‌‌

కెప్టెన్సీ మార్పుపై ద్రవిడ్‌‌‌‌ నో కామెంట్‌‌

సెంచూరియన్‌‌: టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పు గురించి స్పందించేందుకు హెడ్‌‌ కోచ్‌‌ రాహుల్‌‌ ద్రవిడ్‌‌ నిరాకరించాడు. వన్డే కెప్టెన్‌‌గా విరాట్‌‌ కోహ్లీని తీసేసి రోహిత్‌‌ శర్మను అపాయింట్‌‌ చేసే విషయంలో జరిగిన అంతర్గత సంభాషణ మీడి యాకు చెప్పేది కాదన్నాడు.  సౌతాఫ్రికాతో ఫస్ట్ టెస్టుకు ముందు ద్రవిడ్‌‌ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా కెప్టెన్సీ మార్పుపై అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేదు. ‘నిజాయితీగా చెప్పాలంటే ఇది (కెప్టెన్సీ మార్పు) సెలెక్టర్ల పని. దీనిపై నేనేమీ చెప్పలేదు.  ఈ విషయంపై చర్చకు ఇది సరైన వేదిక, సమయం కూడా కాదు.  అలాగే ఆ టైమ్‌‌లో సెలెక్టర్లతో  నా ఇంటర్నల్​ కన్వర్జేషన్​  మీడియాలో రావాల్సిన అవసరం లేదు. దీని గురించి బయటకు చెప్పాలనుకోవడం లేదు’ అని ద్రవిడ్‌‌ స్పష్టం చేశాడు. అంతకుముందు బీసీసీఐ టీవీతో మాట్లాడిన ద్రవిడ్‌‌.. టెస్టు కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. ఈ పదేళ్లలో ఓ క్రికెటర్‌‌గా తను ఎదిగిన తీరు, టీమ్‌‌ కోసం అతను చేసిన పెర్ఫామెన్స్‌‌లు,  టీమ్‌‌ను నడిపిస్తున్న విధానం అమోఘం అన్నాడు. ఫిట్‌‌నెస్‌‌, ఎనర్జీ లెవెల్స్‌‌ను టీమ్‌‌లో ఓ కల్చర్‌‌గా మార్చాడని కొనియాడాడు.