ప్రారంభమైన ఫార్మా ఎగ్జిబిషన్‌‌‌‌

ప్రారంభమైన ఫార్మా ఎగ్జిబిషన్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఇంటర్నేషనల్ ఫార్మా ఎగ్జిబిషన్‌‌‌‌ (ఐఫెక్స్‌‌‌‌) 9వ ఎడిషన్ హైదరాబాద్‌‌‌‌లోని హైటెక్‌‌‌‌ ఎగ్జిబిషన్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో బుధవారం ప్రారంభమైంది. గురు, శుక్రవారాల్లో కూడా  ఓపెన్‌‌‌‌లో ఉంటుంది.   కామర్స్ మినిస్ట్రీ సపోర్ట్‌‌‌‌తో  ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌  ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్‌‌‌‌)  ఈ ఈవెంట్‌‌‌‌ను నిర్వహిస్తోంది.  ప్రపంచంలోని 200 దేశాలకు మన ఫార్మా కంపెనీల ప్రొడక్ట్‌‌‌‌లు వెళుతున్నాయని ఫార్మెక్సిల్ చైర్మన్  ఎస్.వీ. వీరమణి  అన్నారు. కిందటేడాది  25.39 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఎగుమతులు జరిగాయని చెప్పారు.  ఈ ఏడాది 28 బిలియన్ డాలర్ల లక్ష్యానికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.  

వ్యాక్సిన్‌‌‌‌లు, ఆయుష్, హెర్బల్స్,  సర్జికల్‌‌‌‌  ఎగుమతులతో ఈ లక్ష్యం చేరుకుంటామని అన్నారు.   ఈ ఎగ్జిబిషన్‌‌‌‌లో   దాదాపు 400 మంది ఎగ్జిబిటర్లు, 660 మంది విదేశీ సందర్శకులు, దేశ, విదేశాల నుంచి పదివేల మందికి పైగా  సందర్శకులు వస్తారని ఫార్మెక్సిల్‌‌‌‌ అంచనావేస్తోంది. ఇంకా  అనేక సమావేశాలు, సీఈఓ ప్యానెల్ సదస్సులు , జీ20 దేశాలతో ఎగుమతి అవకాశాలపై చర్చలు ఉంటాయని పేర్కొంది. మన ఫార్మాస్యూటికల్ సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఐఫెక్స్ మంచి వేదిక అని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రవి ఉదయ్ భాస్కర్ అన్నారు. కామర్స్ మినిస్ట్రీ  మద్దతు ఇస్తున్న అతిపెద్ద షోలలో ఇది ఒకటి అని పేర్కొన్నారు .