యోగా డే సందర్భంగా తాజ్ మహల్ కు ప్రవేశం ఉచితం

యోగా డే సందర్భంగా తాజ్ మహల్ కు ప్రవేశం ఉచితం

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్ లాంటి ఇతర స్మారక చిహ్నాల వద్ద ఎటువంటి ప్రవేశ రుసుమును వసూలు చేయొద్దని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) నిర్ణయించింది. "అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా సర్కిల్ ఇతర ASI- రక్షిత స్మారక చిహ్నాలలో పర్యాటకులకు ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్టు తెలిపింది. ఇది స్థానిక పర్యాటకులకే కాదు.. భారతీయులు, విదేశీయులందరికీ నిర్దేశించిన చారిత్రక ప్రదేశాల్లో రోజంతా టికెట్టు లేకుండా లోనికి ప్రవేశించేందుకు అనుమతి కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ సిక్రీలో 'పంచ్ మహల్' వద్ద పెద్ద సంఖ్యలో యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్టు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు.