
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఘరాన దొంగల ముఠా పోలుసులకు పట్టుబడింది. రద్దీగా ఉన్న రైళ్లలో ప్రయాణికుల దృష్టి మరల్చి దొంగతనానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను జీఆర్పీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో మొత్తం తొమ్మిది మంది నిందితులు ఉండగా.. ఇందులో ఏడుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు జీఆర్పీఎస్ డీఎస్పీ నర్సయ్య తెలిపారు.
నిందితుల నుండి సుమారు 100 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన బంగారాన్ని టూత్ పేస్ట్ లో పెట్టి తరలిస్తున్నట్లు డీఎస్పీ నర్సయ్య వెల్లడించారు. ప్రస్తుతం ఈ ముఠాపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు