‘బంగార్రాజు’ పండగలాంటి సినిమా

‘బంగార్రాజు’ పండగలాంటి సినిమా
  • పండగలాంటి సినిమా
  • నాగార్జున, నాగచైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ రూపొందిస్తున్న 
  • ‘బంగార్రాజు’ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. 
  • ఈ సందర్భంగా కళ్యాణ్ కృష్ణ చెప్పిన కబుర్లు.

‘‘నేను నాలుగు సినిమాలు డైరెక్ట్  చేస్తే  వాటిలో మూడు నాగార్జున ప్రొడ్యూస్ చేసినవే. రెండింటిలో ఆయన నటించడంతో మా మధ్య మంచి అనుబంధం కూడా ఏర్పడింది.  ప్రతి విషయంలోనూ ఆయన నాకు సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ రిలీజవగానే ‘బంగార్రాజు’ మొదలు పెడదామనుకున్నాం. అయితే  ముందు చైతూతో ఓ మూవీ (రారండోయ్ వేడుక చూద్దాం) చేయమన్నారు. అందుకే ఇది ఆలస్యమైంది. ఈ మూవీ హండ్రెడ్ పర్సెంట్ సోగ్గాడేకి సీక్వెల్. ఆ స్టోరీ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. రాము క్యారెక్టర్ ఉంటుంది కానీ ఎక్కువసేపు కనిపించదు. లావణ్య త్రిపాఠి పాత్రకు స్కోప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో ఆమెను తీసుకోలేదు. పెద్ద బంగార్రాజు లాగానే  చిన్న బంగార్రాజు పాత్ర ఉంటుంది. ఒకే పాత్రను ఇద్దరు హీరోలు చేస్తే ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తుంది. యాక్షన్, రొమాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు అన్ని ఎలిమెంట్స్ ఇద్దరికీ సమానంగా ఉంటాయి. పంచెకట్టులో నాగార్జున హుందాగా కనిపిస్తారు. రమ్యకృష్ణ, కృతీశెట్టిలతో పాటు మరో ఆరుగురు హీరోయిన్స్ నటించారు. కృతి క్యారెక్టర్ బబ్లీగా ఉంటుంది. బీటెక్ చదివి, విలేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటూ, తనకంటే తెలివైన వారుండరని ఫీలయ్యే అమ్మాయి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ హైలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. సంగీతంతో పాటు యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి కూడా ఇంపార్టెన్స్ ఉంది. హ్యూమన్ ఎమోషన్స్ ఉండే సినిమాలను కచ్చితంగా ఆదరిస్తారనేది  నా నమ్మకం. సెన్సార్ వాళ్లు కూడా ‘మీ సినిమా పండగలా ఉంది’ అన్నారు. సంక్రాంతిని టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే సినిమా స్టార్ట్ చేశాం. అప్పటికి ఏ సినిమా రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేదీనీ ప్రకటించలేదు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ రిలీజైనా మా సినిమాని పొంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే విడుదల చేయాలని ముందే డిసైడయ్యాం. దీని తర్వాత  జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఓ మూవీకి కమిటయ్యాను. త్వరలోనే హీరోని అనౌన్స్ చేస్తాం.’’