కొత్త రూల్ : విమానాల్లో.. విదేశాలకు స్వీట్స్ తీసుకెళ్లకుండా నిషేధం

కొత్త రూల్ : విమానాల్లో.. విదేశాలకు స్వీట్స్ తీసుకెళ్లకుండా నిషేధం

మీరు విదేశాలు వెళుతున్నారా.. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ ఇలాంటి దేశాలకు వెళుతున్నారా.. అయితే ఓకే.. కాకపోతే ఒకే ఒక్కటి గుర్తుంచుకోండి.. గతంలో మాదిరిగా కిలోల కొద్దీ స్వీట్లు తీసుకెళదాం అంటే కుదరదు.. దీనిపై నిషేధం ఉంది. మీరు ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్ ఎక్కుతున్నట్లయితే.. మీ లగేజీలో స్వీట్స్ ఉండటం నిషేధం.. వాటిని ఎయిర్ పోర్టు చెకింగ్ దగ్గర.. మీ లగేజీ నుంచి తీసి బయట పడేస్తారు.. మీరు ఊహించలేదు కదా.. ఇలాంటి నిర్ణయాన్ని.. అవును.. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఇప్పుడు ఇలాంటి నిషేధం ఒకటి కొత్తగా అమల్లోకి వచ్చింది.. ఈ వివరాలు పూర్తిగా ఇప్పుడు చూద్దాం...

అంతర్జాతీయ ప్రయాణికులను లగేజీలో స్వీట్లు తీసుకెళ్లేందుకు చెన్నై ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారులు అనుమతించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల నలుగురు ప్రయాణికులు బ్యాంకాక్ వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి వచ్చారు. కస్టమ్స్ అధికారుల చెకింగ్ లో ప్రయాణీకులు తమ వెంట స్వీట్ బాక్సులను తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. ఈ సందర్భంలో విమానం లోపలికి స్వీట్లను అనుమతించలేమని అధికారులు చెప్పినట్టు సమాచారం.

పండుగ సీజన్‌ కావడంతో చెన్నై నుంచి స్వీట్‌ తీసుకెళ్తున్నామని ప్రయాణికులు అధికారులకు వివరించేందుకు ప్రయత్నించగా అధికారులు మిఠాయిలు తీసుకెళ్లేందుకు ప్రయాణికులు అధికారులకు వివరించేందుకు ప్రయత్నించగా అధికారులు మిఠాయిలు తీసుకెళ్లేందుకు ప్రయాణికులను అనుమతించకపోగా.. ఆ తర్వాత వారి టిక్కెట్లను రద్దు చేశారు.

Also Read :- షుగర్ ఉన్నోళ్లు కూడా ఈ చిప్స్ హ్యాపీగా తినొచ్చు

అదే విధంగా శ్రీలంక వెళ్లే ప్రయాణికులు నైట్ డ్రెస్‌లు, కాటన్ చీరలను తమ వెంట తీసుకెళ్లేందుకు చెన్నై ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అనుమతించడం లేదు. సాధారణంగా, శ్రీలంక ప్రజల బంధువులు పండుగ సీజన్‌లో చెన్నై నుంచి దుస్తులు, కాటన్ చీరలను పెద్దమొత్తంలో తీసుకువెళతారు. ఇప్పుడు కస్టమ్స్ ప్రయాణికులను తమతో పాటు శ్రీలంకకు తీసుకెళ్లడానికి అనుమతించడం లేదు. ఈ సంఘటనల నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులు బెంగళూరు, కొచ్చి, తిరువనంతపురంలకు వెళ్లి అక్కడి నుంచి అంతర్జాతీయ ప్రయాణికులుగా ప్రయాణిస్తున్నారు.

అన్ని విమానాశ్రయాలకు కస్టమ్స్ నిబంధనలు సాధారణమని, అయితే ఇక్కడ చెన్నైలో మాత్రం అధికారులు ఇష్టానుసారంగా నిబంధనలు మార్చుకుంటున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అయితే, చెన్నై విమానాశ్రయ కస్టమ్స్‌ను సంప్రదించగా, అధికారులు ఇక్కడి విమానాశ్రయంలో ప్రభుత్వ నిబంధనల మాత్రమే అనుసరిస్తున్నారని, దేశంలోని ఇతర విమానాశ్రయాలు అనుసరిస్తున్న నిబంధనల గురించి తమకు తెలియదని చెప్పారు.