Good Health : షుగర్ ఉన్నోళ్లు కూడా ఈ చిప్స్ హ్యాపీగా తినొచ్చు..

Good Health : షుగర్ ఉన్నోళ్లు కూడా ఈ చిప్స్ హ్యాపీగా తినొచ్చు..

చల్ల చల్లని వెదర్ కి క్రిస్పీ శ్నాక్స్ ని మించిన కాంబినేషన్ ఇంకోటి లేదు. ఆ శ్నాక్స్ ఒంటికి కూడా మేలు చేసేవి అయితే మరీ మంచిది. అలా నోటికి రుచిని.. శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే శ్నాక్స్ ఒకటి ఈ స్వీట్ పొటాటో రెసిపీ. వీటిని తినడం వల్ల వచ్చే లాభాలతో పాటు రెసిపీ ఎలా చేయాలో కూడా చెప్పారు న్యూఢిల్లీకి చెందిన క్లినికల్ న్యూట్రిషనిస్ట్ లో వినీత్ బాత్రా.

వింటర్ లో దొరికే స్వీట్ పొటాటో (చిలగడ దుంప) లో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల గ్లూకోజ్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఆకలిని తగ్గిస్తాయి. ఇన్ ఫ్లయేషన్ పై పోరాడే విటమిన్ -సి కూడా ఎక్కువగా ఉంటుంది వీటిల్లో, పైగా గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తాయి. 

Also Read : ఇవాళ(అక్టోబర్ 28) చంద్ర గ్రహణం.. గర్భిణీలు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

అందుకే షుగర్ పేషెంట్స్ వీటిని కచ్చితంగా డైట్ లో చేర్చుకోవాలి. స్వీట్ పొటాటోలో బీటా కెరోటిన్ అనే కెరోటినాయిడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ కాంపౌండ్ ని మన శరీరం విటమిన్-ఎగా మార్చుకుంటుంది. దానివల్ల కంటి సమస్యలు దరిచేరవు. అలాగే బీటా కెరోటిన్ చర్మాన్ని కూడా అందంగా చేస్తుంది. మెటబాలిజం పనితీరుని మెరుగుపరుస్తుంది ఈ సూపర్ ఫుడ్.

గుండె పనితీరు బాగుండాలన్నా, స్ట్రెస్ దరిచేరకూడదన్నా పొటాషియం సమపాళ్లలో తీసుకోవాలి. దానికోసం ఈ సీజన్ లో స్వీట్ పొటాటో తింటే సరిపోతుంది. అయితే లాభాలున్నాయి కదా అని ఎక్కువ తినకూడదు వీటిని. కిడ్నీలో రాళ్లున్న వాళ్లు వీటిని తినొద్దు అన్నారు లోవ్ నీత్ బాత్రా.

కావాల్సినవి.. 

* స్వీట్ పొటాటో - నాలుగు
* ఆలివ్ ఆయిల్ - నాలుగు టీ స్పూన్ లు
* మిరియాల పొడి - ఒక టీ స్పూన్
* ఉప్పు -తగినంత

రెసిపీ ఇలా తయారు..

స్వీట్ పొటాటోలని శుభ్రంగా కడిగి గుండ్రంగా తరగాలి. వాటిని మరీ మెత్తగా కాకుండా ఉడికించాలి. ఒక గిన్నెలో ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి, కారం వేసి బాగా కలపాలి. అందులో స్వీట్ పొటాటో ముక్కల్ని కూడా వేసి మరోసారి కలపాలి. వాటిని పెనంపై రెండు వైపులా కాల్చి పై నుంచి సరిపడా ఉప్పు చల్లాలి. కావాలంటే నిమ్మరసం పిండుకుని తినొచ్చు.