ఇవాళ(అక్టోబర్ 28) చంద్ర గ్రహణం.. గర్భిణీలు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

ఇవాళ(అక్టోబర్ 28) చంద్ర గ్రహణం.. గర్భిణీలు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

ఖగోళంలో సంభవించే మార్పులు, గ్రహాల కదలికలు, గ్రహణాలు వంటివి మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి చంద్ర గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

Also Read : 250 పాయింట్లు దాటిన గాలి నాణ్యత సూచీ.. ఢిల్లీలో దిగజారుతున్న పరిస్థితులు

గర్భిణీలకు జాగ్రత్తలు..

* గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లకూడదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

* గ్రహణం కిరణాలు మీ ఇంటిలోకి ప్రవేశించకుండా.. మందపాటి కర్టెన్లతో కిటికీలను కప్పాలని నిపుణులు సూచిస్తున్నారు. 

* గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు దైవనామ స్మరణ, శివనామ స్మరణ చేయాలి.

* గ్రహణ సమయంలో గర్భిణీలు నూనె రాసుకోవడం, నీరు త్రాగడం, మలమూత్ర విసర్జనలు చేయడం, జుట్టు దువ్వడం, పళ్ళు తోముకోవడం, లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం కూడా నిషేధం.

* గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు, కేవలం విశ్రాంతి తీసుకోవాలి.

* గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఏదైనా గుడ్డను కత్తిరించడం లేదా.. కుట్టడం లాంటి పనులు చేయకూడదని చెబుతున్నారు. 

* గర్భిణీలు గ్రహణ సమయంలో పదునైన వస్తువులు ఉపయోగించకూడదు.

* ఇతర కార్యకలాపాల్లో కూడా నిమగ్నం అవకూడదు. 

* ఎందుకంటే ఈ చర్యలు శిశువుపై ఒక విధమైన ప్రభావాలను కలిగిస్తాయని పండితులు చెబుతున్నారు. 

* గ్రహణ సమయంలో గర్భిణీలు అహార పదార్థలు ఏవైనా తాగకూడదు, తినకూడదు.

* గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయాలి.

పైన పేర్కొన్న సూచనలు పాటించి.. గర్భిణీల ఆరోగ్యంతో పాటు వారికి పుట్టబోయే బిడ్డ శ్రేయస్సుకు సంబంధించిన కోణంలో ఆలోచించి ఈ నియమాలు పాటిస్తే మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.