పాముతో గేమ్సా.. మెడలో వేసుకొని శివుడిలా డ్యాన్స్.. కాటువేయడంతో..

పాముతో గేమ్సా.. మెడలో వేసుకొని శివుడిలా డ్యాన్స్.. కాటువేయడంతో..

పాముతో గేమ్సా..చుట్టు పక్కల కనిపిస్తేనే అంత దూరం పరుగులు పెడతాం.. అలాంటి పామును మెడలో వేసుకొని డ్యాన్సా..రకరకాల విన్యాసాలు.. ముద్దులు పెట్టడం..పామును మడిచి ముడిపెట్టడం.. ఇది  మద్యం మత్తులో ఓ యువకుడి ఆటలు.. అతను చేసిన విన్యాసాలకు ఫలితం.. చివరికి ప్రాణాలు కోల్పోయాడు..  
వివరాల్లోకి వెళితే.. 

ఉత్తరప్రదేశ్ లోని డయోరియా జిల్లాకు చెందిన 22యేళ్ల యువకుడు జైస్వాల్.. శివుని రూపమైన మహాకాల్ గా నటిస్తూ..పాముతో కనిపిస్తున్నవీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. పామును శివుడిలా మెడలో, చేతికి చుట్టుకొని తన నాలుకతో ముద్దాడేందుకు యత్నిస్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. సిగరెట్ తాగుతూ పాముని చేతితో కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. మత్తులో జైస్వాల్ ఇలా పరాచికాలాడుతుండగా పాము కాటువేసింది. జైస్వాల్ మరణానికి దారితీసింది.  4 నిమిషాల 38 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను జైస్వాల్ స్వయంగా చిత్రీకరించినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్ట మ్ కు తరలించారు. చూశారా.. ప్రమాదకరమైన ప్రాణులతో పరాచికాలు మంచిదికాదు... వీలైనంత జాగ్రత్తగా ఉండాలని జైస్వాల్ ఉదంతం చెప్పకనే చెపుతోంది.