ఆర్​సీహెచ్​పీలో ఎలక్ట్రీషియన్ల సంఖ్య పెంచాలి : రజాక్​

ఆర్​సీహెచ్​పీలో ఎలక్ట్రీషియన్ల సంఖ్య పెంచాలి : రజాక్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం ఏరియాలోని ఆర్​సీహెచ్​పీలో ఎలక్ట్రీషియన్ల కొరత ఉందని ఐఎన్​టీయూసీ ఏరియా వైస్​ ప్రెసిడెంట్​ ఎండీ. రజాక్​ అధికారులను కోరారు. రుద్రంపూర్​ కోల్​ హ్యాండ్లింగ్​ ప్లాంట్(ఆర్​సీహెచ్​పీ)లో నలుగురు మాత్రమే ఎలక్ట్రీషియన్లు ఉన్నారని, షిఫ్ట్​లతో పాటు జనరల్​ షిఫ్ట్​ మెయింటెనెన్స్​ ఇబ్బంది అవుతుందన్నారు. 

ఎలక్ట్రీషియన్ల సంఖ్యను పెంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్​సీహెచ్​పీలో బెల్ట్​ మీద డస్ట్​ ఎక్కువగా వస్తోందని, వాటర్​ స్ప్రే చేయించాలని కోరారు. పరిశుభ్రమైన డ్రింకింగ్​ వాటర్​ ఏర్పాటు చేయాలన్నారు. ఆర్​సీహెచ్​పీలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ ప్రోగ్రాంలో యూనియన్​ నాయకులు డి. శంకర్​ బాబు, కేశవరెడ్డి, చిలక రాజయ్య, సత్తార్​పాషా, నటరాజ్, కే. శ్రీనివాస్, సమ్మయ్య, రాధాకృష్ణ, ఆనందరావు, సుబ్బరాజు  తదితరులు పాల్గొన్నారు.