ఐఐటీలో ముగిసిన ఇన్వెంటివ్ ఇన్నోవేషన్ 2.0

ఐఐటీలో ముగిసిన ఇన్వెంటివ్ ఇన్నోవేషన్ 2.0

కంది, వెలుగు : సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) హైదరాబాద్ క్యాంపస్ లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఇన్వెంటివ్ ఇన్నోవేషన్ ఫెయిర్ 2.0 శనివారం  ముగిసింది. ఈ ఫెయిర్​లో స్టూడెంట్స్​120 ప్రయోగాత్మక ప్రాజెక్టులను ప్రదర్శించారు.

ఈ ఫెయిర్ ను శుక్రవారం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కార్యక్రమంలో వివిధ దేశాల యూనివర్సిటీలకు చెందిన స్టూడెంట్స్ తయారు చేసిన ఇన్నోవేషన్ స్టాల్స్‌‌‌‌ అందరిని ఆకట్టుకున్నాయి.