దేశంలో విధ్వంసాలకు కుట్ర కేసులో సోషల్‌‌‌‌‌‌‌‌మీడియా కాంటాక్ట్స్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా ఇన్వెస్టిగేషన్​

దేశంలో విధ్వంసాలకు కుట్ర కేసులో సోషల్‌‌‌‌‌‌‌‌మీడియా కాంటాక్ట్స్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా ఇన్వెస్టిగేషన్​

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: దేశంలో విధ్వంసాలకు కుట్ర కేసులో మొబైల్ డేటా, సోషల్‌‌‌‌‌‌‌‌మీడియా కాంటాక్ట్స్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా ముగ్గురు నిందితులను స్పెషల్​ ఇన్వెస్టిగేషన్​ టీం(సిట్) ప్రశ్నిస్తోంది. రెండో రోజు విచారణలో భాగంగా గురువారం కీలక వివరాలు రాబట్టినట్లు తెలిసింది. ఈ కేసులో అబ్దుల్‌‌‌‌‌‌‌‌ జాహెద్‌‌‌‌‌‌‌‌, సమీయుద్దీన్‌‌‌‌‌‌‌‌, మాజ్‌‌‌‌‌‌‌‌ హసన్‌‌‌‌‌‌‌‌ ఫరూక్‌‌‌‌‌‌‌‌లను సిట్‌‌‌‌‌‌‌‌ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. నాంపల్లి కోర్టు ఈ నెల17 వరకు వీరి కస్టడీకి అనుమతించింది. దీంతో ముగ్గురు నిందితులను రహస్య ప్రాంతానికి తరలించి విడివిడిగా ప్రశ్నిస్తూ వీడియో రికార్డింగ్‌‌‌‌‌‌‌‌ ద్వారా స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్లను రికార్డ్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చిన ఫండ్స్, గ్రనేడ్స్‌‌‌‌‌‌‌‌, రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తదితర వివరాలను రాబడుతోంది. 

గ్రనేడ్లు ఎలా ట్రాన్స్​పోర్ట్​ అయినయ్?

చైనాలో తయారైన హ్యాండ్ గ్రనేడ్లు మెదక్‌‌‌‌‌‌‌‌లోని మనోహరాబాద్​కు ఎలా ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యాయనే వివరాలను సిట్‌‌‌‌‌‌‌‌అధికారులు రాబడుతున్నారు. జాహెద్‌‌‌‌‌‌‌‌పై నిఘా ఉండడంతో స్లీపర్ సెల్స్‌‌‌‌‌‌‌‌ను యాక్టీవ్‌‌‌‌‌‌‌‌ చేసినట్లు అనుమానిస్తున్నారు. స్లీపర్ సెల్స్‌‌‌‌‌‌‌‌తో గ్రనేడ్లను పేల్చేందుకు ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేశారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. నేపాల్‌‌‌‌‌‌‌‌ బార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీదుగా గ్రనేడ్లను తరలించినట్లు ఆధారాలు సేకరించారు. వీటిని ఎలా ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. జాహెద్‌‌‌‌‌‌‌‌ గ్యాంగ్‌‌‌‌‌‌‌‌కు ఎవరు సహకరించారనే వివరాలను ఆరా తీస్తున్నారు. మోస్ట్​ వాంటెండ్​ టెర్రరిస్ట్ ఫర్హతుల్లా ఘోరి ఆదేశాలతో పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. జాహెద్‌‌‌‌‌‌‌‌ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేసిన దిల్‌‌‌‌‌‌‌‌ అఫ్రోజ్, అబ్దుల్‌‌‌‌‌‌‌‌ హైదర్, సోహైల్‌‌‌‌‌‌‌‌ ఖురేషీ, అబ్దుల్‌‌‌‌‌‌‌‌ ఖలీమ్‌‌‌‌‌‌‌‌ గురించి ఆరా తీస్తోంది. 

ఫండ్స్​ను ఎక్కడికి తరలించారు?

ఫర్హతుల్లా ఘోరి నెట్ వర్క్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్రానికి చెందిన ఎంతమంది ఉన్నారనే వివరాలపై సిట్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో స్లీపర్ సెల్స్‌‌‌‌‌‌‌‌ను యాక్టివ్ చేసి బాంబుల తయారీ, బ్లాస్టింగ్స్‌‌‌‌‌‌‌‌కు అనువైన ప్రాంతాలు, పోలీస్‌‌‌‌‌‌‌‌ యాక్టివిటిస్‌‌‌‌‌‌‌‌ను తెలుసుకునేందుకు ఉపయోగించారా? అనే వివరాలను రాబడుతున్నారు. దసరా ఉత్సవాలు, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ మీటింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి విధ్వంసాలకు ప్లాన్ చేశారనే కోణంలో సిట్‌‌‌‌‌‌‌‌ విచారిస్తోంది. గ్రనేడ్లను ఎక్కడ? ఎప్పుడు? పేల్చేందుకు రెక్కీ చేశారనే వివరాలను రాబడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ముగ్గురు నిందితుల కాల్‌‌‌‌‌‌‌‌ డాటాను విశ్లేషిస్తోంది. నిందితుల బ్యాంక్ అకౌంట్స్‌‌‌‌‌‌‌‌లో ఏడాది నుంచి డిపాజిట్‌‌‌‌‌‌‌‌అయిన డబ్బు వివ రాలను సేకరిస్తోంది. పాకిస్తాన్​లోని అనుమానిత అకౌంట్స్‌‌‌‌‌‌‌‌ నుంచి భారీ మొత్తంలో డిపాజిట్ అయినట్లు గుర్తిం చింది. ఈ డబ్బును ఎక్కడికి తరలిం చారనే వివరాలను రాబడుతోంది.