ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు ముమ్మరం

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు ముమ్మరం
  • బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, కాల్ డేటా ఆధారంగా క్వశ్చన్లు
  • లాయర్  స్టేట్‌‌మెంట్‌‌ ఆధారంగా ఇంకొందరికి నోటీసులు!

హైదరాబాద్‌‌, వెలుగు: టీఆర్ఎస్​ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో స్పెషల్‌‌ ఇన్వెస్టిగేషన్‌‌ టీమ్‌‌(సిట్‌‌) దర్యాప్తు వేగవంతం చేసింది. కరీంనగర్‌‌‌‌కు చెందిన లాయర్ శ్రీనివాస్‌‌ను సోమవారం విచారించింది. బంజారాహిల్స్‌‌ కమాండ్‌‌ కంట్రోల్‌‌ సెంటర్‌‌‌‌లో సిట్‌‌ చీఫ్‌‌ సీవీ ఆనంద్‌‌ నేతృత్వంలోని బృందం ఆయనను 8 గంటలపాటు ప్రశ్నించింది. ఈ కేసులో నిందితులైన నందకుమార్‌‌‌‌, సింహయాజిల కాల్‌‌డేటా, వాట్సాప్ చాటింగ్ ఆధారంగా వివరాలు సేకరించింది. సింహయాజికి బుక్‌‌ చేసిన ఫ్లైట్‌‌ టికెట్ల వివరాల ఆధారంగా ప్రశ్నించినట్లు తెలిసింది. నిందితులకు ఫ్లైట్‌‌ టికెట్లు బుక్‌‌ చేయడంతో పాటు డీల్‌‌ విషయం శ్రీనివాస్​కు ముందే తెలుసనే ఆరోపణలు రావడంతో ఈ నెల16న సిట్‌‌ అధికారులు ఆయనకు నోటీసులిచ్చారు.

డీల్ మ్యాటర్ శ్రీనివాస్​కు ముందే తెలుసా?

సింహయాజి, నందకుమార్‌‌‌‌తో శ్రీనివాస్​కు ఉన్న పరిచయమేంటి? మొయినాబాద్​లో జరిగిన డీల్‌‌ వివరాలు శ్రీనివాస్‌‌కు ముందే తెలుసా? ఇంకెవరెవరికి తెలుసు? అనే వివరాలు రాబట్టేందుకు దర్యాప్తు కొనసాగింది. సింహయాజితో శ్రీనివాస్​కు ఉన్న పరిచయాల వివరాలను సిట్ అధికారులు రికార్డ్‌‌ చేశారు. రామచంద్రభారతి హైదరాబాద్ రావడానికి ఒక రోజు ముందు(అక్టోబర్ 25) నందకుమార్‌‌, సింహయాజితో శ్రీనివాస్ మాట్లాడినట్లు ఆధారాలను సిట్ గుర్తించింది. సింహయాజి తిరుపతి నుంచి హైదరాబాద్‌‌కు వచ్చేందుకు శ్రీనివాస్​ను ఫ్లైట్‌‌ టికెట్లు ఎవరు బుక్ చేయమన్నారు? అనే కోణంలో విచారించింది.

మళ్లీ నోటీసులకు రంగం సిద్ధం

విచారణకు హాజరుకాని బీఎల్‌‌ సంతోష్, తుషార్‌‌‌‌, జగ్గూస్వామికి మరోసారి నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. విచారణలో శ్రీనివాస్ ఇచ్చిన వివరాల ఆధారంగా రాష్ట్రంలోని ఇంకొందరికి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. శ్రీనివాస్​ను కూడా మరోసారి విచారించనున్నారు. ఇందుకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు సిట్ బృందం చర్యలు తీసుకుంటోంది.

సింహయాజిని పూజల కోసం రప్పించేందుకే..

హైదరాబాద్​లో పూజలు నిర్వహించేందుకే సింహయాజితో మాట్లాడానని శ్రీనివాస్ సిట్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సిట్‌‌ కీలక ఆధారాలు సేకరించింది. ఎమ్మెల్యేలకు ఆఫర్ విషయంలో అనుమానాస్పద నంబర్లతో శ్రీనివాస్​కు ఉన్న సంబంధంపై ఆరా తీసింది. సింహయాజికి  బుక్‌‌ చేసిన  ఫ్లైట్‌‌ టికెట్లు, బ్యాంక్‌‌ ట్రాన్సాక్షన్లను బట్టి స్టేట్‌‌మెంట్‌‌ రికార్డ్‌‌ చేసినట్లు తెలిసింది. శ్రీనివాస్ స్టేట్​మెంట్ ఆధారంగా రోహిత్‌‌ రెడ్డితో నందకుమార్‌‌‌‌ డీల్‌‌ డిస్కషన్‌‌ గురించి విరాలను సిట్ సేకరిస్తోంది.