కుక్కల దాడి ఘటనపై ఇయ్యాల హైకోర్టులో విచారణ

కుక్కల దాడి ఘటనపై  ఇయ్యాల  హైకోర్టులో విచారణ

గండిపేట/ఖైరతాబాద్/హుజూరాబాద్/వైరా, వెలుగు: వీధి కుక్కలు దడ పుట్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 8 మంది చిన్నారులపై అటాక్ చేశాయి. గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్రనగర్‌‌ లోని ఎర్రబోడ ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదుగురు చిన్నారులపై దాడి చేశాయి. ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు కాగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఎర్రబోడ బస్తీకి చెందిన పునీత్‌‌(8), పవన్‌‌(8) బుధవారం ఇంటి ముందు ఆడుకుంటుండగా.. వీధి కుక్కలు పునీత్‌‌ను కరిచా యి. అది గమనించి పవన్‌‌ రాయితో కొట్టేందుకు ప్రయత్నించగా అతడిని కూడా కరిచాయి. స్థానికు లు వచ్చి కుక్కల గుంపును తరిమికొట్టారు. అయి తే కొంచెం ముందుకు వెళ్లిన కుక్కలు.. ఇదే బస్తీకి చెందిన చేతన్‌‌(9), వెంకటేష్‌‌(8)తో పాటు మరో బాలుడిని కరిచాయి. పునీత్, పవన్‌‌ కు కాళ్లు, చేతు లు, తలకు గాయాలయ్యాయి. తల్లిదండ్రులు హైదర్‌‌గూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, డాక్ట ర్లు ట్రీట్ మెంట్ చేసి పంపించారు. ఇక ఖైరతాబాద్ పరిధి చింతల్ బస్తీలోని అంబేద్కర్ నగర్ లో బాలుడిపై కుక్క దాడి చేసింది. కేశవ్, లక్ష్మి దంపతుల కొడుకు అనిల్ కుమార్(6) స్థానిక అంగన్ వాడీ సెంటర్ లో చదువుకుంటున్నాడు. సాయంత్రం 4 గంటలకు అంగన్ వాడీ సెంటర్ నుంచి బయటకు రాగా, అదే టైమ్ లో అక్కడున్న కుక్క అతడి కాలును కొరికింది. పిల్లాడిని నిలోఫర్ హాస్పిటల్ కు తరలించారు.  

ఎస్సీ హాస్టల్ లోకి చొరబడి దాడి.. 

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లోకి చొరబడిన కుక్క.. స్టూడెంట్ పై దాడి చేసింది. మంగళవారం రాత్రి ఏడో తర గతి చదువుతున్న సుమంత్ రెడ్డి వాష్ రూమ్ కు వెళ్లగా.. గోడ దూకి లోపలికి వచ్చిన కుక్క అత నిపై అటాక్ చేసింది. తోటి విద్యార్థులు వచ్చి దా న్ని తరిమికొట్టారు. 108 అంబులెన్స్ కు ఫోన్ చే యగా, సుమంత్ ను కరీంనగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆ టైమ్ లో హాస్టల్ లో సార్లు ఎవరూ లేరని స్టూడెంట్లు తెలిపారు. రోజూ వాచ్ మెన్ మాత్రమే ఉంటాడని, కొన్ని రోజులుగా అత డు కూడా రావడం లేదన్నారు. దీనిపై వార్డెన్ నాగరాజును అడగ్గా.. ‘‘హాస్టల్ కు ప్రహరీ, గేట్ ఉంది. కుక్క గోడ దూకి లోపలికి వచ్చింది. హాస్టల్ పక్కనే ఉన్న తోట ఓనర్ కుక్కలు పెంచుకుంటున్నారు. అతని కుక్కే స్టూడెంట్ పై దాడి చేసింది. దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాం” అని తెలిపారు. బుధవారం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దగోపతిలో 16 నెలల బాలుడిపై కుక్క దాడి చేసింది. ఊటుకూరి గణేశ్,​ రమాదేవిల కొడుకు  సిద్ధార్థ్ రావన్ పై దాడి చేయగా, తీవ్రంగా గాయపడ్డాడు. పిల్లాడిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.

కుక్కల దాడి ఘటనపై  ఇయ్యాల  హైకోర్టులో విచారణ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌ లో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనను హైకోర్టు సుమోటో పిటిషన్‌‌గా స్వీకరించింది. దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్‌‌ బెంచ్‌‌ గురువారం విచారణ చేపట్టనుంది. న్యూస్ పేపర్లలో వచ్చిన వార్తలను పిల్‌‌గా పరిగణించిన కోర్టు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ కార్యదర్శి, హైదరాబాద్‌‌ జిల్లా కలెక్టర్‌‌, అంబర్‌‌పేట డిప్యూటీ కమిషనర్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేసింది. కాగా, ఈ నెల 19న అంబర్ పేటలో వీధి కుక్కలు దాడి చేయడంతో ఆరేండ్ల పిల్లాడు చనిపోయాడు.