బెస్ట్ టీచర్ అవార్డుకు అప్లికేషన్ల ఆహ్వానం

బెస్ట్ టీచర్ అవార్డుకు అప్లికేషన్ల ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సర్కారు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు, హెడ్ ‌మాస్టర్లు , ప్రిన్సిపల్స్, లెక్చరర్లు స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు. ఆగస్టు 7లోగా డీఈఓల కు అప్లికేషన్స్ పంపాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్ట‌ర్ శ్రీదేవసేన చెప్పారు. హెడ్‌మాస్టర్లు , ప్రిన్సిపల్స్ కు 10, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్టీజీ, పీజీటీ, టీజీటీలకు 31, డైట్, సీటీఈ, ఐఏఎస్ఈ లెక్చరర్ల‌కు 2 అవార్డులివ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..