బీఓబీ భారీ నోటిఫికేషన్.. పదో తరగతితో 500 పోస్టుల భర్తీ.. పూర్తి డీటైల్స్

బీఓబీ భారీ నోటిఫికేషన్.. పదో తరగతితో 500 పోస్టుల భర్తీ.. పూర్తి డీటైల్స్

ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్​ బరోడా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖల్లో ఖాళీగా ఉన్న 500 పోస్టులను భర్తీ చేయనున్నది. పదో తరగతి విద్యార్హతతో భర్తీ చేయనున్న ఆఫీస్ అసిస్టెంట్ పోస్టు ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, సెలెక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. 


పోస్టుల సంఖ్య: 

500 (ఆఫీస్ అసిస్టెంట్/ ప్యూన్)(ఎస్సీ 65, ఎస్టీ 33, ఓబీసీ 108, ఈడబ్ల్యూఎస్ 42, అన్ రిజర్వ్​డ్ 252, ఎక్స్ సర్వీస్​మెన్ 97, ఎక్స్ సర్వీస్​మెన్ డిసేబుల్​ 12, పీడబ్ల్యూబీడీ  9. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం13 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ 2, ఓబీసీ 3, ఈడబ్ల్యూఎస్ 1, అన్ రిజర్వ్​డ్ 7, ఎక్స్ సర్వీస్​మెన్ 3 ఉన్నాయి. 

వయోపరిమితి: 

కనిష్ట వయోపరిమితి 18 ఏండ్లు. గరిష్ట వయోపరిమితి 26 ఏండ్లు.(1999, మే 1 నుంచి 2007, మే 1 మధ్యలో జన్మించిన వారై ఉండాలి.) ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబులిటీస్​కు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్​మెన్​కు అదనంగా మూడేండ్లు, డిసేబుల్ ఎక్స్ సర్వీస్​మెన్​కు వయోపరిమితిలో ఎనిమిది ఏండ్లు సడలింపు ఉంటుంది. 

వితంతు, విడాకులు తీసుకున్న మహిళలు, న్యాయబద్ధంగా విడాకులు తీసుకుని మళ్లీ వివాహం చేసుకోని మహిళలకు జనరల్ అయితే 35 ఏండ్లు, ఓబీసీలు అయితే 38 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీలకు 40 ఏండ్లు. 

ఎలిజిబిలిటీ: 

పదో తరగతి లేదా మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతంలో ఉద్యోగం కోసమైతే అప్లికేషన్ సమర్పిస్తున్నారో ఆ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంత  స్థానిక భాషలో మాట్లాడటం, రాయడం, చదవడం రావాలి.   

అప్లికేషన్లు ప్రారంభం: మే 3.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్​మెన్, మహిళా అభ్యర్థులకు రూ.100. 
 

అప్లికేషన్ లాస్ట్ డేట్: మే 23.

సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్ టెస్ట్, స్థానిక భాషలో ప్రావీణ్య పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఏ అభ్యర్థి అయితే ఆన్​లైన్ టెస్టులో క్వాలిఫై లేదా ఉత్తీర్ణత సాధిస్తారో వారికి మాత్రమే స్థానిక భాష ప్రావీణ్య టెస్ట్ ఉంటుంది. 

ఆన్​లైన్ టెస్ట్

మొత్తం 100 మార్కులకు ఆన్​లైన్ టెస్ట్ ఉంటుంది. నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ (25 మార్కులు), జనరల్ అవేర్​నెస్ (25 మార్కులు), ఎలిమెంటరీ అర్థమెటిక్ (25 మార్కులు), సైకోమెట్రిక్ టెస్ట్(రీజనింగ్)(25 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి. 80 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. 

అయితే, ఎలాంటి జవాబు గుర్తించకుండా వదిలివేసిన ప్రశ్నకు నెగెటివ్ మార్కింగ్ ఉండదు.  ప్రతి అభ్యర్థి ఆన్​లైన్ టెస్టులో ప్రతి విభాగంలో కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. స్థానిక భాషా ప్రావీణ్య టెస్టుకు అర్హత సాధించడానికి మొత్తం 100 మార్కులకు కట్–ఆఫ్​ మార్కులు సాధించడం తప్పనిసరి. పరీక్ష ఇంగ్లీష్​/ హిందీ/ సంబంధిత రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంత అధికారిక భాషలో ఉంటుంది.

ప్రొబేషన్

ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి విధుల్లో చేరిన తేదీ నుంచి ఆరు నెలలు ప్రొబేషన్ సమయం ఉంటుంది. విజయవంతంగా ప్రొబేషన్ పూర్తి చేసిన వారిని శాశ్వత ప్రాతిపదికన నియమిస్తారు.