ఐఫోన్ ఇంటర్నల్ స్టోరేజీ 1టీబీ..?

V6 Velugu Posted on Sep 14, 2021

క్యాలిఫోర్నియా: ఐఫోన్ కొత్త మోడల్ పై చెలరేగుతున్న ఉహాగానాలు మరికాసేపట్లో తెరపడనుంది. క్యాలిఫోర్నియాలో రాత్రి 10.30 గంటలకు జరిగే యాపిల్‌ ఈవెంట్‌ ఐఫోన్ 13ను మార్కెట్‌లో విడుదల చేస్తున్నారు. ఈ మోడల్‌కు సంబంధించి అనేక ఊహాగానాలు ఉత్కంఠ రేపుతుండా.. ఇంటర్నల్ స్టోరేజీని ఏకంగా 1టీబీకి పెంచినట్లు సమాచారం లీక్ అయింది. ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 13 మిని ఫోన్లు అంటే నాన్‌ ప్రొ మోడల్స్‌ 128జీబీ, 256జీబీ, 512 జీబీ స్టోరేజీతో వస్తుండగా ఐఫోన్‌ 13 ప్రొ ఐఫోన్‌ 13 ప్రొ మోడల్స్‌ నాలుగు స్టోరేజీ ఆప్షన్లతో వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐఫోన్‌ 13 ప్రొ మోడల్స్‌ కూడా 128జీబీ, 256జీబీ, 512 జీబీ స్టోరేజీతోపాటు 2021 ఐఫోన్‌ ప్రొ మోడల్‌ 1 టీబీ స్టోరేజీతో వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే నిజమైతే మొబైల్ ఫోన్ల చరిత్రలో 1టీబీ ఇంటర్నల్‌ మెమొరీతో వస్తున్న తొలి ఐఫోన్‌ ఇదే అవుతుంది.
 

Tagged , iPhone LIVE updates, iPhone California event, iPhone launching, iPhone features, iPhone latest updates, Apple event iPhone 13

Latest Videos

Subscribe Now

More News