IPL 2021: హైదరాబాద్ పై ఢిల్లీ సూపర్ విజయం

IPL 2021: హైదరాబాద్ పై ఢిల్లీ సూపర్ విజయం

సన్‌‌ రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ను దురదృష్టం వెంటా డింది. మిడిలార్డర్​ ఫెయిల్యూర్​ ఆ జట్టును ముంచింది. కేన్‌‌ విలియమ్సన్‌‌ అద్భుతంగా పోరాడినా రైజర్స్​కు ఇంకో ఓటమి తప్పలేదు. ఈ సీజన్‌‌ తొలి సూపర్‌‌ ఓవర్‌‌ పోరు టీమ్​కు కలిసి రాలేదు.  ఆదివారం ఇక్కడి చెపాక్‌‌ స్టేడియంలో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ సూపర్‌‌ ఓవర్లో హైదరాబాద్‌‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్‌‌ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 159 రన్స్‌‌ చేసింది. ఓపెనర్‌‌ పృథ్వీ షాతో పాటు  రిషబ్‌‌ పంత్‌‌ (27 బాల్స్‌‌లో 4 ఫోర్స్‌‌, 1 సిక్సర్‌‌తో 37)  స్టీవ్‌‌ స్మిత్‌‌ (25 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 34 నాటౌట్‌‌) రాణించారు. రైజర్స్‌‌ బౌలర్లలో సిద్దార్థ్‌‌ కౌల్‌‌ (2/31) రెండు వికెట్లు తీశాడు. అనంతరం ఛేజింగ్‌‌లో  20 ఓవర్లలో ఏడు వికెట్లకు సన్‌‌రైజర్స్‌‌ కూడా సరిగ్గా 159 రన్స్‌‌ చేయడంతో మ్యాచ్‌‌ సూపర్‌‌ ఓవర్‌‌కు దారి తీసింది. విలియమ్సన్​తో పాటు జానీ బెయిర్‌‌స్టో (18 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 38), చివర్లో సుచిత్‌‌ (6 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 14 నాటౌట్‌‌) రాణించాడు. మెరుపు ఫిఫ్టీ చేసిన పృథ్వీ మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌గా నిలిచాడు. 

పృథ్వీ ఫిఫ్టీ.. బౌలర్ల కట్టడి

ఢిల్లీ ఇన్నింగ్స్‌‌ స్టార్టింగ్‌‌కు.. ఫినిషింగ్‌‌కు పొంతనే లేదు. తొలుత యంగ్‌‌ ఓపెనర్‌‌ పృథ్వీ షా జోరు చూస్తే ఆ టీమ్‌‌ 200 రన్స్‌‌ చేసేలా కనిపించింది. కానీ, మిడిల్‌‌ ఓవర్లలో హైదరాబాద్‌‌ బౌలర్లు  సత్తా చాటడంతో ఢిల్లీ జోరుకు కళ్లెం పడింది. టాస్‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌ ఎంచుకున్న  ఢిల్లీకి పృథ్వీ అదిరిపోయే ఆరంభం అందించాడు. ఖలీల్‌‌ వేసిన ఫస్ట్‌‌ ఓవర్లోనే వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను రెండో ఓవర్లో మరో రెండు బౌండ్రీలు రాబట్టాడు. సిద్ధార్థ్‌‌ కౌల్‌‌ వేసిన మూడో ఓవర్లో ధవన్‌‌ (28)  ఇచ్చిన క్యాచ్‌‌ను కేదార్‌‌ జాదవ్‌‌ డ్రాప్‌‌ చేశాడు. అప్పటికి అతను 5 రన్స్‌‌ వద్దే ఉన్నాడు.  దాంతో, శిఖర్‌‌ జాగ్రత్త పడగా.. అదే ఓవర్లో  పృథ్వీ లాంగాఫ్‌‌ మీదుగా సిక్సర్‌‌ కొట్టాడు. అతని జోరుకు పవర్‌‌ప్లేలో ఢిల్లీ 51 రన్స్‌‌ రాబట్టింది.  సుచిత్‌‌ వేసిన ఎనిమిదో ఓవర్లో వరసగా రెండు బౌండ్రీలతో ధవన్‌‌ స్పీడు పెంచగా.. జోరు కొనసాగించిన పృథ్వీ 35 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. దాంతో, సగం ఓవర్లకు 80/0తో నిలిచిన క్యాపిటల్స్‌‌ భారీ స్కోరుపై కన్నేసింది. అయితే, సెకండాఫ్‌‌లో ఎస్‌‌ఆర్‌‌హెచ్‌‌ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. 11వ ఓవర్లో ధవన్‌‌ను ఔట్‌‌ చేసిన రషీద్‌‌ బ్రేక్‌‌ ఇచ్చాడు. సుచిత్‌‌ వేసిన తర్వాతి ఓవర్లో కెప్టెన్‌‌ రిషబ్‌‌ పంత్‌‌తో సమన్వయ లోపంతో పృథ్వీ రనౌటవడంతో ఢిల్లీకి డబుల్‌‌ షాక్‌‌ తగిలింది.  స్టీవ్‌‌ స్మిత్‌‌ నెమ్మదిగా బ్యాటింగ్‌‌ చేసినా.. పంత్‌‌ క్రమం తప్పకుండా బౌండ్రీలు కొట్టడంతో  16 ఓవర్లకు ఢిల్లీ 127/2తో నిలిచింది. స్లాగ్‌‌ ఓవర్లలో హైదరాబాద్‌‌ బౌలర్లు ప్రత్యర్థిపై ఒత్తిడి తెచ్చారు. శంకర్‌‌ బౌలింగ్‌‌లో స్మిత్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను కౌల్‌‌ డ్రాప్‌‌ చేయగా..  ఖలీల్‌‌ వేసిన 18వ ఓవర్లో స్మిత్‌‌, పంత్‌‌ చెరో బౌండ్రీతో 11 రన్స్‌‌ రాబట్టారు.  తర్వాతి ఓవర్లో పంత్‌‌తోపాటు  హెట్‌‌మయర్‌‌ (1) వికెట్లు తీసిన కౌల్‌‌ మూడు రన్సే ఇచ్చాడు. అయితే, ఖలీల్‌‌ వేసిన  లాస్ట్‌‌ ఓవర్లో 4,6 సహా 14 రన్స్‌‌ రాబట్టిన స్మిత్‌‌ ఢిల్లీ స్కోరు 150 దాటించాడు. 

ఆదుకున్న కేన్​

ఛేజింగ్‌‌లో తొలుత బెయిర్‌‌స్టో మెరుపులు మెరిపించగా.. కేన్‌‌ విలియమ్సన్‌‌ చివరి దాకా పోరాడటంతో ప్రత్యర్థి స్కోరును హైదరాబాద్‌‌ అందుకోగలిగింది. అశ్విన్‌‌ వేసిన రెండో ఓవర్లోనే బెయిర్‌‌స్టో క్యాచ్‌‌ను హెట్‌‌మయర్‌‌ డ్రాప్‌‌ చేయగా.. అది బౌండ్రీ వెళ్లింది. ఈ చాన్స్‌‌ను సద్వినియోగం చేసుకున్న జానీ.. స్టోయినిస్‌‌ వేసిన తర్వాతి ఓవర్లో 4, 6తో జోరు పెంచాడు. ఆపై, అశ్విన్‌‌ బౌలింగ్‌‌లోనూ సిక్సర్‌‌ బాదినా.. తర్వాతి బాల్‌‌కే డేవిడ్‌‌ వార్నర్‌‌ (6) రనౌట్‌‌కు కారణం అయ్యాడు. అయినా అతను దూకుడుగానే ఆడాడు. అక్షర్‌‌ బౌలింగ్‌‌లో మరో 4,6తో రెచ్చిపోయాడు. అవేశ్‌‌ ఖాన్‌‌ వేసిన ఆరో ఓవర్లో విలియమ్సన్‌‌ ఫోర్‌‌ కొట్టగా.. జానీ సిక్స్‌‌ బాదాడు. కానీ, మరో షాట్‌‌ ఆడే ప్రయత్నంలో తర్వాతి బాల్‌‌కే ధవన్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. పవర్‌‌ప్లే ముగిసే సరికి 56/2తో నిలిచిన ఇన్నింగ్స్‌‌ను విలియమ్సన్‌‌ ముందుకు తీసుకెళ్లాడు. యంగ్‌‌స్టర్‌‌ విరాట్‌‌ సింగ్‌‌ (14 బాల్స్‌‌లో 4) రన్స్‌‌ తీసేందుకు ఇబ్బంది పడ్డా.. కేన్‌‌ మాత్రం క్రమం తప్పకుండా బౌండ్రీలు కొడుతూ టార్గెట్‌‌ను కరిగించాడు. 12వ ఓవర్లో విరాట్‌‌ను అవేశ్‌‌ ఔట్ చేయగా.. అక్షర్‌‌ బౌలింగ్‌‌లో కేదార్‌‌ (9), రబాడ ఓవర్లో కేన్‌‌ చెరో ఫోర్‌‌ కొట్టి 14 ఓవర్లకు స్కోరు వంద దాటించారు. ఈ టైమ్‌‌లో క్రీజులో కుదురుకున్న కేదార్‌‌ను స్టంపౌట్‌‌ చేసిన మిశ్రా హైదరాబాద్‌‌పై ఒత్తిడి పెంచాడు. కేన్‌‌ 42 బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నప్పటికీ..  17వ ఓవర్లో  వరుస బాల్స్‌‌లో అభిషేక్‌‌ (5), రషీద్‌‌ ఖాన్ (0)ను ఎల్బీ చేసిన అక్షర్‌‌ నాలుగే రన్స్‌‌ ఇవ్వడంతో హైదరాబాద్‌‌పై  ప్రెజర్‌‌ మరింత పెరిగింది. ఈ దశలో మిశ్రా బౌలింగ్‌‌లో 4 కొట్టిన కేన్‌‌ 11 రన్స్‌‌ రాబట్టాడు. చివరి12 బాల్స్‌‌లో 28 రన్స్‌‌ అవసరం అవగా.. క్రీజులో కేన్‌‌తో పాటు విజయ్‌‌ శంకర్‌‌(8) ఉండడంతో రైజర్స్‌‌ ఆశలు కోల్పోలేదు.  అవేశ్‌‌ వేసిన 19వ ఓవర్లో శంకర్‌‌ బౌల్డ్‌‌ అవగా.. సుచిత్‌‌ రెండు ఫోర్లు కొట్టి టీమ్​ను రేసులో నిలిపాడు. లాస్ట్‌‌ ఓవర్లో 16 రన్స్‌‌ అవగా.. రబాడ వైడ్‌‌తో ఓవర్‌‌ ప్రారంభించాడు. ఫస్ట్‌‌ బాల్‌‌ను కేన్‌‌ స్కూప్‌‌ షాట్‌‌తో ఫోర్‌‌ కొట్టాడు. నెక్ట్స్‌‌ బాల్‌‌కు బై రూపంలో ఒక రన్‌‌ వచ్చింది. థర్డ్‌‌ బాల్‌‌ను సుచిత్‌‌ సిక్సర్‌‌ కొట్టడంతో చివరి మూడు బాల్స్‌‌లో 4 రన్స్‌‌ అవసరం అయ్యాయి. కానీ, 3 సింగిల్స్‌‌ మాత్రమే రావడంతో మ్యాచ్‌‌ టై అయింది. 

ఢిల్లీ: పృథ్వీ (రనౌట్‌‌) 53, ధవన్‌‌ (బి) రషీద్‌‌ 28, పంత్‌‌ (సి) సుచిత్‌‌ (బి) కౌల్‌‌ 37, స్మిత్‌‌ (నాటౌట్) 34, హెట్‌‌మయర్‌‌ (సి) విలియమ్సన్‌‌ (బి) కౌల్‌‌ 1, స్టోయినిస్‌‌ (నాటౌట్‌‌) 2; ఎక్స్‌‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 159/4; వికెట్ల పతనం: 1–81, 2–84, 3–142, 4–145.
 బౌలింగ్‌‌: ఖలీల్‌‌ 4–0–42–0, అభిషేక్‌‌ 1–0–14–0, కౌల్‌‌ 4–0–31–2, సుచిత్‌‌ 4–0–21–0, శంకర్‌‌ 3–0–19–0, రషీద్‌‌ 4–0–31–1.

హైదరాబాద్‌‌:  వార్నర్‌‌ (రనౌట్‌‌) 6, బెయిర్‌‌స్టో (సి) ధవన్‌‌ (బి) అవేశ్‌‌ 38, విలియమ్సన్‌‌ (నాటౌట్‌‌) 66, విరాట్‌‌ సింగ్‌‌ (సి) స్టోయినిస్‌‌ (బి) అవేశ్‌‌ 4, కేదార్‌‌ (స్టంప్డ్‌‌) పంత్‌‌ (బి) మిశ్రా 9, అభిషేక్‌‌  (ఎల్బీ) అక్షర్‌‌ 5, రషీద్‌‌ (ఎల్బీ) అక్షర్‌‌ 0, శంకర్‌‌ (బి) అవేశ్‌‌ 8,  సుచిత్‌‌ (నాటౌట్‌‌) 14,  ఎక్స్​ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 159/7; 
వికెట్ల పతనం: 1–28, 2–56, 3–84, 4–104, 5–117, 6–117, 7–136.
 బౌలింగ్‌‌: రబాడ  3–0–25–0, అశ్విన్‌‌ 4–0–27–0, స్టోయినిస్‌‌ 1–0–12–0.అక్షర్‌‌ 4–0–26–2, అవేశ్‌‌ 4–0–34–2, మిశ్రా 4–0–31–1