IPL 2021: కోల్‌‌కతాపై ఢిల్లీ గ్రాండ్​ విక్టరీ

IPL 2021: కోల్‌‌కతాపై ఢిల్లీ గ్రాండ్​ విక్టరీ
రాణించిన ధవన్‌‌ రసెల్‌‌, గిల్‌‌ పోరాటం వృథా ఐపీఎల్‌‌‌‌–14లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌ మరింత రాటుదేలుతోంది..! బలమైన ప్రత్యర్థులు ఎదురైనా.. భారీ స్కోర్లున్నా.. వీరోచిత బ్యాటింగ్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌లను ఏకపక్షంగా మార్చేస్తోంది..! తాజాగా యంగ్‌‌‌‌ గన్‌‌‌‌ పృథ్వీ షా (41 బాల్స్‌‌‌‌లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 82).. సూపర్‌‌‌‌ షోకు తోడుగా సీనియర్‌‌‌‌ ధవన్‌‌‌‌ (47 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 1 సిక్సర్​తో 46) కూడా మెరవడంతో.. ఢిల్లీ ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది..! మరోవైపు బ్యాటింగ్‌‌‌‌లో రసెల్‌‌‌‌ (27 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 45 నాటౌట్‌‌‌‌), శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (38 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 1 సిక్సర్​తో 43) మెరిసినా.. బౌలింగ్‌‌‌‌లో ఫెయిలైన నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌ ఐదో ఓటమితో డీలా పడింది..!! ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌ చేసిన ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోలో కోల్‌‌‌‌కతాకు మరో ఓటమి తప్పలేదు. కాస్ట్‌‌‌‌లీ ప్లేయర్లున్నా, ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌కు కొదవలేకపోయినా, అనుకున్న టైమ్‌‌‌‌లో సరిగ్గా ఆడలేక భారీ మూల్యం చెల్లించుకుంటున్నది. దీంతో గురువారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌పై గెలిచింది. టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన కోల్‌‌‌‌కతా 20 ఓవర్లలో 154/6 స్కోరు చేసింది. తర్వాత ఢిల్లీ 16.3 ఓవర్లలో 156/3 స్కోరు చేసి గెలిచింది. పృథ్వీ, ధవన్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 132 రన్స్‌‌‌‌ జోడించి విజయాన్ని ఖాయం చేశారు. పృథ్వీకి ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఆదుకున్న రసెల్‌‌‌‌.. ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన కేకేఆర్‌‌‌‌కు గిల్‌‌‌‌ మంచి పునాది వేశాడు. ఇషాంత్‌‌‌‌, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో బౌండ్రీస్‌‌‌‌ రాబడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించాడు. కానీ నితీశ్‌‌‌‌ రాణా (15) సిక్సర్‌‌‌‌తో టచ్‌‌‌‌లో కనిపించినా.. థర్డ్‌‌‌‌ ఓవర్‌‌‌‌లోనే వెనుదిరిగాడు. 25/1 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన రాహుల్‌‌‌‌ త్రిపాఠి (19) ఫర్వాలేదనిపించాడు. గిల్‌‌‌‌కు అండగా నిలవడంతో పవర్‌‌‌‌ప్లేలో కోల్‌‌‌‌కతా 45/1 స్కోరుతో నిలిచింది. 8వ ఓవర్‌‌‌‌లో అక్షర్‌‌‌‌ బాల్‌‌‌‌ను స్టాండ్స్‌‌‌‌లోకి పంపిన గిల్‌‌‌‌ వీలైనంత వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. దీంతో10 ఓవర్లలో 69/1తో మంచి పొజిషన్‌‌‌‌లో ఉన్న నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌ ఆ తర్వాత చతికిలపడింది. ఈ ఓవర్‌‌‌‌ థర్డ్‌‌‌‌ బాల్‌‌‌‌కు త్రిపాఠి ఔట్‌‌‌‌కావడంతో వికెట్లపతనం మొదలైంది. గిల్​తో త్రిపాఠి సెకండ్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 44 రన్స్‌‌‌‌ జోడించాడు.. తర్వాతి ఓవర్‌‌‌‌లో మూడు బాల్స్‌‌‌‌ తేడాలో మోర్గాన్‌‌‌‌ (0), నరైన్‌‌‌‌ (0) డకౌటయ్యారు. దీంతో 69/1తో ఉన్న స్కోరు కాస్త 11వ ఓవర్‌‌‌‌లో 75/4గా మారింది. ఈ దశలో వచ్చిన రసెల్‌‌‌‌ సునామీ ఇన్నింగ్స్‌‌‌‌తో చెలరేగిపోయాడు. 13వ ఓవర్‌‌‌‌లో గిల్‌‌‌‌ వెనుదిరిగినా.. ఇషాంత్‌‌‌‌, రబాడ, అవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో రసెల్‌‌‌‌ నాలుగు టవరింగ్‌‌‌‌ సిక్సర్లతో రెచ్చిపోయాడు. మధ్యలో దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌ (14) ఓ సిక్సర్‌‌‌‌ బాదినా వికెట్‌‌‌‌ కాపాడుకోలేకపోయాడు.రసెల్‌‌‌‌.. కార్తీక్‌‌‌‌తో ఆరో వికెట్‌‌‌‌కు 27, కమిన్స్‌‌‌‌ (11 నాటౌట్‌‌‌‌)తో ఏడో వికెట్‌‌‌‌కు 45 రన్స్‌‌‌‌ జోడించడంతో కోల్‌‌‌‌కతా ఆ మాత్రం స్కోరైనా సాధించింది. దుమ్మురేపిన పృథ్వీ.. టార్గెట్‌‌‌‌ఛేజింగ్‌‌‌‌లో ఢిల్లీ దుమ్మురేపింది. ముఖ్యంగా పృథ్వీ షా.. శివం మావి వేసిన ఫస్ట్‌‌‌‌ ఓవర్‌‌‌‌లోనే వరుసగా ఆరు ఫోర్లు కొట్టి 25 రన్స్‌‌‌‌తో సూపర్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ ఇచ్చాడు. తర్వాత కూడా.. ఓ ఎండ్‌‌‌‌లో ధవన్‌‌‌‌ను నిలబెట్టి బౌండ్రీలు రాబట్టాడు. నరైన్‌‌‌‌ వేసిన థర్డ్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో వరుసగా 4, 6తో 14 రన్స్‌‌‌‌ పిండుకున్నాడు. మధ్యలో ధవన్‌‌‌‌ ఒకటి, రెండు ఫోర్లు బాదడంతో పవర్‌‌‌‌ప్లేలో ఢిల్లీ 67 రన్స్‌‌‌‌తో పటిష్ట స్థితిలో నిలిచింది. 8వ ఓవర్‌‌‌‌లో కమిన్స్‌‌‌‌ బాల్‌‌‌‌కు సింగిల్‌‌‌‌ తీసిన పృథ్వీ 18 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ కంప్లీట్‌‌‌‌ చేశాడు. తర్వాతి బాల్స్‌‌‌‌ను ధవన్‌‌‌‌, షా.. రోప్‌‌‌‌ దాటించడంతో 10 రన్స్‌‌‌‌ వచ్చాయి. వరుణ్‌‌‌‌ వేసిన 10వ ఓవర్‌‌‌‌లో పృథ్వీ లాంగాఫ్‌‌‌‌లో భారీ షాట్‌‌‌‌ కొట్టాడు. కానీ అక్కడే ఫీల్డింగ్‌‌‌‌ చేస్తున్న గిల్‌‌‌‌ క్యాచ్‌‌‌‌ అందుకోలేకపోవడంతో సిక్సర్‌‌‌‌ వచ్చింది. ఈ ఒక్క చాన్స్‌‌‌‌ మినహా పృథ్వీ టాప్‌‌‌‌ క్లాస్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌తో అదరగొట్టాడు. రెండో ఎండ్‌‌‌‌లో ధవన్‌‌‌‌ కూడా అండగా నిలవడంతో ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌లో టీమ్‌‌‌‌ స్కోరు 95/0కు పెరిగింది. తర్వాతి రెండు ఓవర్లలో ఇద్దరు చెరో బౌండ్రీ రాబట్టడంతో 18 రన్స్‌‌‌‌ వచ్చాయి. 13వ ఓవర్‌‌‌‌లో నరైన్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌ను పృథ్వీ రెండో సిక్సర్‌‌‌‌గా మలిచాడు. ఆ తర్వాతి ఓవర్‌‌‌‌లోనే కమిన్స్‌‌‌‌కు కూడా ఇదే సీన్‌‌‌‌ను చూపెట్టాడు. కానీ ఐదో బాల్‌‌‌‌కు ధవన్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసిన పేసర్‌‌‌‌.. కేకేఆర్‌‌‌‌కు ఊరట కలిగించాడు. ఫస్ట్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 87 బాల్స్‌‌‌‌లో 132 రన్స్‌‌‌‌ రావడంతో ఢిల్లీ విజయం సులువైంది. ఇక గెలవాలంటే 36 బాల్స్‌‌‌‌లో 23 రన్స్‌‌‌‌ కావాల్సిన దశలో కెప్టెన్‌‌‌‌ పంత్‌‌‌‌ (16) .. ప్రసిధ్‌‌‌‌ వేసిన 15వ ఓవర్‌‌‌‌లో 4, 6తో 14 రన్స్‌‌‌‌ రాబట్టాడు. 9 రన్స్‌‌‌‌ అవసరమైన దశలో.. 16వ ఓవర్‌‌‌‌లో కమిన్స్‌‌‌‌ నాలుగు బాల్స్‌‌‌‌ తేడాలో పృథ్వీ, పంత్‌‌‌‌ని ఔట్‌‌‌‌ చేసినా అప్పటికే మ్యాచ్​ ఢిల్లీ విజయం ఖాయమైంది. స్టోయినిస్‌‌‌‌ (6 నాటౌట్‌‌‌‌) టార్గెట్​ను పూర్తి చేశాడు. కోల్‌‌కతా: రాణా (స్టంప్‌‌) పంత్‌‌ (బి) పటేల్‌‌ 15, గిల్‌‌ (సి) స్మిత్‌‌ (బి) అవేశ్‌‌ ఖాన్‌‌ 43, త్రిపాఠి (సి) లలిత్‌‌ యాదవ్‌‌ (బి) స్టోయినిస్‌‌ 19, మోర్గాన్‌‌ (సి) స్మిత్‌‌ (బి) లలిత్‌‌ యాదవ్‌‌ 0, నరైన్‌‌ (బి) లలిత్‌‌ యాదవ్‌‌ 0, రసెల్‌‌ (నాటౌట్‌‌) 45, కార్తీక్‌‌ (ఎల్బీ) పటేల్‌‌ 14, కమిన్స్‌‌ (నాటౌట్‌‌) 11, ఎక్స్‌‌ట్రాలు: 7, మొత్తం: 20 ఓవర్లలో 154/6. వికెట్లపతనం: 1–25, 2–69, 3–74, 4–75, 5–82, 6–109. బౌలింగ్‌‌: ఇషాంత్‌‌ 4–0–34–0, రబాడ 4–0–31–0, అక్షర్‌‌ పటేల్‌‌ 4–0–32–2, అవేశ్‌‌ ఖాన్‌‌ 4–0–31–1, లలిత్‌‌ యాదవ్‌‌ 3–0–13–2, స్టోయినిస్‌‌ 1–0–7–1. ఢిల్లీ: పృథ్వీ (సి) రాణా (బి) కమిన్స్‌‌ 82, ధవన్‌‌ (ఎల్బీ) కమిన్స్‌‌ 46, పంత్‌‌ (సి) మావి (బి) కమిన్స్‌‌ 16, స్టోయినిస్‌‌ (నాటౌట్‌‌)6, హెట్‌‌మయర్‌‌ (నాటౌట్‌‌) 0, ఎక్స్‌‌ట్రాలు: 6, మొత్తం: 16.3 ఓవర్లలో 156/3. వికెట్లపతనం: 1–132, 2–146, 3–150. బౌలింగ్‌‌: శివం మావి 1–0–25–0, వరుణ్‌‌ 4–0–34–0, ప్రసిధ్‌‌ కృష్ణ 3.3–0–36–0, నరైన్‌‌ 4–0–36–0, కమిన్స్‌‌ 4–0–24–3.