
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్ బెయిర్ స్టో తక్కువ స్కోరుకే ఔటయినా..మరో ఓపెనర్ వార్నర్ 57, మనీష్ పాండే 61 తో చెలరేగారు. కేన్ విలియమ్సన్ 24 పరుగులు చేశాడు. దీంతో చెన్నైకి 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ఎంగిడి 2, సామర్ కరణ్ ఒక వికెట్ తీశారు.