
ముంబై: ఐపీఎల్ పద్నాలుగో సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ వరుసగా ఓటములను చవిచూస్తోంది. ఆడిన ఐదింటిలో రెండు మ్యాచ్‌లు గెలిచిన ముంబై.. మూడింట్లో ఓటమి పాలైంది. శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో ఆడిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ముంబై ఓటమికి వ్యూహాత్మక తప్పిదాలే కారణమని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసుకోవాలని సూచించాడు. బ్యాటింగ్ ఆర్డర్‌తోపాటు పలు తప్పిదాలను రిపీట్ చేయకుండా ఉంటే టీమ్ గెలుపుబాట పడుతుందన్నాడు. ‘సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి అతడ్ని బ్యాటింగ్ ఆర్డర్‌లో పైన ఆడించాలి. పవర్‌ప్లేలో సూర్య క్రీజులో ఉంటే మరింత పరుగులు స్కోరు బోర్డుపై చేరతాయి. రోహిత్, సూర్య లాంటి ప్లేయర్లు ఇన్నింగ్స్ ప్రారంభంలో దూకుడుగా ఆడితే మంచి మూమెంటమ్ వస్తుంది’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.